జ్యోతిషవిద్య అనన్య సామాన్యమైనది. ఎందుకంటే ఇది కాల స్వరూపము. కాలమంటేభగవంతుడే. ఆ కాలాన్ని గణించేదిసూర్యుని ఆధారంగా.కాబట్టి సూర్యుడే జ్యోతిస్స్వరూపము.ఆసూర్యుడేగాయత్రీస్వరూపము.అందునాసూర్యుడుగ్రహరాజు.ఆగ్రహరాజుఅనుగ్రహంపరిపూర్ణంగా ఉంటేజ్యోతిషశాస్త్రం అభ్యసించడం చాలాసులభం. జ్యోతి అంటే వెలుగు . ఆకాశంలో ఉండే జ్యోతుల యొక్క విశ్లేషణ ఆధారంగా వివరించేశాస్త్రం కాబట్టిఇది జ్యోతిష శాస్త్రమైనది.
పంచభూతాలలో మధ్యమంగా లెక్కించ గలిగింది కాంతి. ఇదే మనం ఆరాధించే పంచ భూతాత్మిక స్వరూపమైన గాయత్రి.గాయత్రి యొక్కమధ్యమ ముఖం సవితృ మండలాంతర్గతమైన కాంతిస్వరూపమే ఈ జ్యోతిషం.
అందుచేతనేజ్యోతిష్కుడుతప్పకసూర్యారాధకుడుకావలసి ఉంటుంది.సూర్యారాధనఅంటేనే ప్రకృతిఆరాధన.ఈపంచభూతాత్మకమైన ప్రకృతియేజ్యోతిస్స్వరూపమైన గాయత్రీమాత.
జాతకచక్రం వ్యక్తి స్వరూప స్వభావాలకు ప్రతీక. ఒక వ్యక్తి గుణగణాలు జాతకచక్రం ఆధారంగామూడువంతులు చెప్పవచ్చు.మిగిలిన ఒకవంతు ఆ వ్యక్తి రూపు రేఖలను అనుసరించి చెప్పవలసి ఉంటుంది. వ్యక్తి జీవిత గమనంలో జాతకం మార్గసూచికలా ఉపకరిస్తుంది.మార్గంలో బాటకుఇరువైపులానున్నవిషయసూచికలు ( బోర్డులు) ఎలాగెతే మంచిచెడ్డలను సూచిస్తాయో అలాగే మానవ సుదీర్ఘ జీవితయాత్రలోమహాదశా ఆంతర్ధశలుమంచి చెడ్డలు సూచిస్తాయి. వాటిని అనుసరించి సమయానుకూలంగా ప్రవర్తించి తగిన శుభములను పొందవచ్చును.
© 2017,www.logili.com All Rights Reserved.