వేదములకు కన్నులుగా చెప్పబడ్డ జ్యోతిశాస్త్రరీత్యా బూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలలోజరుగు ఫలములనుగుర్తించి వర్తమాన (జరుగుచున్న) కాలములో భవిష్యత్తు (రాబోవు) కాలములో పాపగ్రహముల వల్ల కలుగు కష్ట నష్టములనుగుర్తించిదోషపరిహారములను ఆచరించుట వల్ల 50 శాతముఉపశమనముపొందవచ్చు.అదేవిధంగాశుభగ్రహములవల్ల కలుగుమేలుగుర్తించి అనుగ్రహార్థం పూజచేయుట ద్వారా శుభత్వాన్ని రెట్టింపు పొందవచ్చును.
రవి, చంద్ర, కుజ, గురు, కేతు గ్రహములు వైష్ణవ గ్రహములు, శని, శుక్ర, బుధ,రాహువులు శైవగ్రహములనిపరాశరవచనం.కావున రవి, చంద్ర, కుజ, గురుగ్రహ పూజా విధానము వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలోను, శని, శుక్ర, బుధ,రాహువు గ్రహ పూజా విధానములు రుద్ర విధానములోను వివరించబడినవి. .
పరాశర సిద్ధాంతరీత్యా పరిహారక్రియలు అన్న ఈ పుస్తకములో అనుగ్రహార్థం, దోషపరిహార్థం పంచతత్వము ద్వారాశాంతివిధానములను వివరించుచున్నాను.
1) పూజలో శబ్దరూపములో స్తోత్రములు, మూలమంత్రములు పటించుట ద్వారా ఆకాశతత్వము ద్వారా అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును.
2) పూజలో అభి షేకాదుల వల్ల జలతత్వము ద్వారా అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును.
3) హోమయుక్తంగా అగ్నితత్వము వల్ల అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును.
4) గ్రహధాన్యములు దిగదీసి అయా దిక్కులకు నియమిత కాలాలలో పెట్టుట ద్వారా భూతత్వము (పృధ్వీ తత్వము) మరియు వాయుతత్వము ద్వారా దోష పరిహారము పొందవచ్చును.
పంచభూతాత్మకం ముక్కోటి దేవతలకు నిలయం అయిన గోవు ద్వారా నవగ్రహ శాంతి విధానం అతి తక్కువ ఖర్చుతోసామాన్యులు కూడా ఆచరించి దోషపరిహారము పొందవచ్చును. ఈ గోశాంతి విధానము కూడా తెలియపరుచు చున్నాను.
ఆదిపత్య శుభగ్రహధారణా యంత్రాలను ధరించు విధానముకూడా వివరించు చున్నాను. ఈ ఆధిపత్య శుభగ్రహ యంత్రములను కంఠము నందుగాని, కుడి భుజమునకుగాని ధరించి ఆధిపత్య శుభగ్రహ ఫలాలు రెట్టింపు పొందవచ్చు. పై 18 సత్యాన్ని అనుభవపూర్వకముగా గ్రహించి వివరించుచున్నాను.
వేదములకు కన్నులుగా చెప్పబడ్డ జ్యోతిశాస్త్రరీత్యా బూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలలోజరుగు ఫలములనుగుర్తించి వర్తమాన (జరుగుచున్న) కాలములో భవిష్యత్తు (రాబోవు) కాలములో పాపగ్రహముల వల్ల కలుగు కష్ట నష్టములనుగుర్తించిదోషపరిహారములను ఆచరించుట వల్ల 50 శాతముఉపశమనముపొందవచ్చు.అదేవిధంగాశుభగ్రహములవల్ల కలుగుమేలుగుర్తించి అనుగ్రహార్థం పూజచేయుట ద్వారా శుభత్వాన్ని రెట్టింపు పొందవచ్చును. రవి, చంద్ర, కుజ, గురు, కేతు గ్రహములు వైష్ణవ గ్రహములు, శని, శుక్ర, బుధ,రాహువులు శైవగ్రహములనిపరాశరవచనం.కావున రవి, చంద్ర, కుజ, గురుగ్రహ పూజా విధానము వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలోను, శని, శుక్ర, బుధ,రాహువు గ్రహ పూజా విధానములు రుద్ర విధానములోను వివరించబడినవి. . పరాశర సిద్ధాంతరీత్యా పరిహారక్రియలు అన్న ఈ పుస్తకములో అనుగ్రహార్థం, దోషపరిహార్థం పంచతత్వము ద్వారాశాంతివిధానములను వివరించుచున్నాను. 1) పూజలో శబ్దరూపములో స్తోత్రములు, మూలమంత్రములు పటించుట ద్వారా ఆకాశతత్వము ద్వారా అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును. 2) పూజలో అభి షేకాదుల వల్ల జలతత్వము ద్వారా అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును. 3) హోమయుక్తంగా అగ్నితత్వము వల్ల అనుగ్రహము, దోషపరిహారము పొందవచ్చును. 4) గ్రహధాన్యములు దిగదీసి అయా దిక్కులకు నియమిత కాలాలలో పెట్టుట ద్వారా భూతత్వము (పృధ్వీ తత్వము) మరియు వాయుతత్వము ద్వారా దోష పరిహారము పొందవచ్చును. పంచభూతాత్మకం ముక్కోటి దేవతలకు నిలయం అయిన గోవు ద్వారా నవగ్రహ శాంతి విధానం అతి తక్కువ ఖర్చుతోసామాన్యులు కూడా ఆచరించి దోషపరిహారము పొందవచ్చును. ఈ గోశాంతి విధానము కూడా తెలియపరుచు చున్నాను. ఆదిపత్య శుభగ్రహధారణా యంత్రాలను ధరించు విధానముకూడా వివరించు చున్నాను. ఈ ఆధిపత్య శుభగ్రహ యంత్రములను కంఠము నందుగాని, కుడి భుజమునకుగాని ధరించి ఆధిపత్య శుభగ్రహ ఫలాలు రెట్టింపు పొందవచ్చు. పై 18 సత్యాన్ని అనుభవపూర్వకముగా గ్రహించి వివరించుచున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.