శ్రీరస్తు
శ్రీ హయగ్రీవాయ నమః
జ్యోతిష ఫల గ్రంథము 1. ముహూర్త విషయము
నవగ్రహ స్తోత్రము
శ్లో। ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః!! ఈ మహామంత్రమును నిత్యము. పఠించుచున్నయెడల సమస్త బాధలు తొలగును. సకలజనులకు సులభముగ తెలియనట్లు ముహూర్తభాగము, ప్రశ్నభాగము గోచారఫలితములు యీ గ్రంథములో విపులముగ తెలుపడినవి.
నవగ్రహములు
1. రవి, 2. చంద్రుడు, 3. కుజుడు, 4. బుధుడు, 5. గురుడు, 6. శుక్రుడు, 7. శని, 8. రాహువు, 9. కేతువు. -
రాశుల పేర్లు
1. మేషము, 2. వృషభము, 3. మిధునము, 4. కర్కాటకము, 5. సింహము, 6. కన్య, 7. తుల, 8. వృశ్చికము, 9. ధనుస్సు, 10. మకరము, 11. కుంభము, 12. మీనము.
మాసములు
1. చైతము, 2. వైశాఖము, 3. జ్యేష్ఠము, 4. ఆషాఢము, 5. శ్రావణము, 6. భాద్రపదము, 7. ఆశ్వయుజము, 8. కార్తీకము, 9. మార్గశిరము, 10. పుష్యమి, 11. మాఘము 12. ఫాల్గుణము.
నక్షత్రములు
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్థ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, పూర్వా షాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
© 2017,www.logili.com All Rights Reserved.