శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తిగారు వృత్తి రీత్యా ఏయే పదవులు అలంకరించినా ప్రవృత్తిరీత్యా మంచి రచయితా. ఆధ్యాత్మిక చింతన గలవారు. వారితో నా పరిచయం గడిచిన రెండు మూడు సంవత్సరాలే అయినా ఎన్నో ఏళ్ల బంధం వున్న వ్యక్తిలా జిల్లెళ్లమూడిలో అందరింటి వాడుగా మసలుతున్న్నారు. జిల్లెళ్లమూడి చేరిన అతని కాలంలోనే 'అమ్మ' అనుగ్రహంతో అనేక అనుభూతులను పొందినవారు. అమ్మ పట్ల అపారమయిన భక్తీ విశ్వాసాలతో మానసిక సాన్నిహిత్యాన్ని కలిగి, అమ్మ సాహిత్యాన్ని, ముఖ్యంగా అమ్మ జీవిత చరిత్ర అయిన "అమ్మ జీవిత మహోదధి"ని అధ్యయనం చేశారు.
ఆ క్రమంలో వారి మదిలో మెదిలి, వారి కలం నుండి జాలు వారిన అక్షరాంజలియే ఈ గ్రంథం. ఈ గ్రంథం చదివిన వారికి, 'అమ్మ'ను భౌతికంగా వారు దర్శించలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. అమ్మ మాటలు - "నేను నేనైన నేను", "ఈ సృష్టి నాది - అనాది" అన్న మాటలకు అద్దంపడుతూ ఈ గ్రంథం 'అమ్మే బ్రహ్మ'ను రూపొందించారు. ఈ ఒక్క గ్రంథాన్ని చదివిన వారికి 'అమ్మ' సంపూర్ణ తత్త్వాన్ని అధ్యయనం చేసిన స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తున్నాను.
- బ్రహ్మాండం రవీంద్రరావు
శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తిగారు వృత్తి రీత్యా ఏయే పదవులు అలంకరించినా ప్రవృత్తిరీత్యా మంచి రచయితా. ఆధ్యాత్మిక చింతన గలవారు. వారితో నా పరిచయం గడిచిన రెండు మూడు సంవత్సరాలే అయినా ఎన్నో ఏళ్ల బంధం వున్న వ్యక్తిలా జిల్లెళ్లమూడిలో అందరింటి వాడుగా మసలుతున్న్నారు. జిల్లెళ్లమూడి చేరిన అతని కాలంలోనే 'అమ్మ' అనుగ్రహంతో అనేక అనుభూతులను పొందినవారు. అమ్మ పట్ల అపారమయిన భక్తీ విశ్వాసాలతో మానసిక సాన్నిహిత్యాన్ని కలిగి, అమ్మ సాహిత్యాన్ని, ముఖ్యంగా అమ్మ జీవిత చరిత్ర అయిన "అమ్మ జీవిత మహోదధి"ని అధ్యయనం చేశారు. ఆ క్రమంలో వారి మదిలో మెదిలి, వారి కలం నుండి జాలు వారిన అక్షరాంజలియే ఈ గ్రంథం. ఈ గ్రంథం చదివిన వారికి, 'అమ్మ'ను భౌతికంగా వారు దర్శించలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. అమ్మ మాటలు - "నేను నేనైన నేను", "ఈ సృష్టి నాది - అనాది" అన్న మాటలకు అద్దంపడుతూ ఈ గ్రంథం 'అమ్మే బ్రహ్మ'ను రూపొందించారు. ఈ ఒక్క గ్రంథాన్ని చదివిన వారికి 'అమ్మ' సంపూర్ణ తత్త్వాన్ని అధ్యయనం చేసిన స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తున్నాను. - బ్రహ్మాండం రవీంద్రరావు© 2017,www.logili.com All Rights Reserved.