వినాయక చవితి మన భారతదేశంలో ఒక ముఖ్యపండుగ ఆరోజున హిందువులందరూ తమ గృహాలు, వ్యాపారస్థలాలు, దేవాలయాలు, పరిశ్రమలలోనే కాక వీధులలో కూడా వినాయకుని ప్రతిమలు ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు జరిపి ఆఖరు రోజున జలనిమజ్జనం చేస్తారు. అది అనాదిగా వస్తున్న ఆచారం. వినాయక చవితిని గూర్చిన మరికొన్ని విశేషాలను మా హిందు పండగలులో సైన్సు ) అనే పుస్తకంలో వ్రాశాం. చూడండి.
రెండంగుళాలు పొడవుగల విగ్రహం నుండి అతి భారీగా వంద అడుగుల ఎత్తుగల విగ్రహాల వరకూ ఈనాడు వినాయక చవితికి తయారు చేస్తున్నారు. వాటిని వివిధ జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఆ విగ్రహాలలో అధిక భాగం విగ్రహాలు చైనా క్లే మొదలయిన యితర పదార్థాలతో చేసి వాటికి దుష్ప్రభావాలు కలిగించగల రసాయనాలు కలిగిన రంగులు వేస్తున్నారు. అందువలన కొన్ని నష్టాలు కలుగుతున్నమాట నిజం. పూర్వం వినాయక విగ్రహాలను చెరువులు మొదలయిన జలాశయాలలోని మట్టిని తెచ్చి దానితో చేసేవారు. అందువలన ఆ విగ్రహాలను జలాశయాలలో నిమజ్జనం చేసినపుడు ఆ విగ్రహలు నీటిలో కరిగిపోయి మరల మట్టిలో కలిసిపోయేవి. కానీ ఈనాడు వివిధ రకాల పదార్థలతో విగ్రహాలను చేయటం వలన, బట్టీలలో కాల్చటంవలన, భారీ విగ్రహాలు కావటం వలన అవి నీటిలో కరగవు. వ్యర్థపదార్థాలవలె మిగిలిపోయి జలాశయాలను, నదులను, సముద్రాలను కలుషిత పరచి, ప్రవాహాలను ఆటంక పరుస్తున్నాయి. మరియు వాటికి పూసిన రసాయనాల రంగులు జలాలలో కాలుష్యం నింపుతున్నాయి. అందువలన మనుషుల, జంతువుల, పక్షుల ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం హెచ్చుగావుంది.
అందుకే విగ్రహాలను కేవలం మట్టితో చేసుకోమనీ, బట్టిల్లో కాల్చవద్దనీ కొందరు పెద్దలు, ప్రభుత్వాలు యెంత మొత్తుకున్నా చాలమంది ప్రజలు లెక్క......................
వినాయకుడి ప్రతిమలు వినాయక చవితి మన భారతదేశంలో ఒక ముఖ్యపండుగ ఆరోజున హిందువులందరూ తమ గృహాలు, వ్యాపారస్థలాలు, దేవాలయాలు, పరిశ్రమలలోనే కాక వీధులలో కూడా వినాయకుని ప్రతిమలు ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు జరిపి ఆఖరు రోజున జలనిమజ్జనం చేస్తారు. అది అనాదిగా వస్తున్న ఆచారం. వినాయక చవితిని గూర్చిన మరికొన్ని విశేషాలను మా హిందు పండగలులో సైన్సు ) అనే పుస్తకంలో వ్రాశాం. చూడండి. రెండంగుళాలు పొడవుగల విగ్రహం నుండి అతి భారీగా వంద అడుగుల ఎత్తుగల విగ్రహాల వరకూ ఈనాడు వినాయక చవితికి తయారు చేస్తున్నారు. వాటిని వివిధ జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఆ విగ్రహాలలో అధిక భాగం విగ్రహాలు చైనా క్లే మొదలయిన యితర పదార్థాలతో చేసి వాటికి దుష్ప్రభావాలు కలిగించగల రసాయనాలు కలిగిన రంగులు వేస్తున్నారు. అందువలన కొన్ని నష్టాలు కలుగుతున్నమాట నిజం. పూర్వం వినాయక విగ్రహాలను చెరువులు మొదలయిన జలాశయాలలోని మట్టిని తెచ్చి దానితో చేసేవారు. అందువలన ఆ విగ్రహాలను జలాశయాలలో నిమజ్జనం చేసినపుడు ఆ విగ్రహలు నీటిలో కరిగిపోయి మరల మట్టిలో కలిసిపోయేవి. కానీ ఈనాడు వివిధ రకాల పదార్థలతో విగ్రహాలను చేయటం వలన, బట్టీలలో కాల్చటంవలన, భారీ విగ్రహాలు కావటం వలన అవి నీటిలో కరగవు. వ్యర్థపదార్థాలవలె మిగిలిపోయి జలాశయాలను, నదులను, సముద్రాలను కలుషిత పరచి, ప్రవాహాలను ఆటంక పరుస్తున్నాయి. మరియు వాటికి పూసిన రసాయనాల రంగులు జలాలలో కాలుష్యం నింపుతున్నాయి. అందువలన మనుషుల, జంతువుల, పక్షుల ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం హెచ్చుగావుంది. అందుకే విగ్రహాలను కేవలం మట్టితో చేసుకోమనీ, బట్టిల్లో కాల్చవద్దనీ కొందరు పెద్దలు, ప్రభుత్వాలు యెంత మొత్తుకున్నా చాలమంది ప్రజలు లెక్క......................© 2017,www.logili.com All Rights Reserved.