తూర్పు తెల తెల వారుతోంది. పట్టణాలింకా భారంగానే ఊపిరి తీస్తున్నాయి. పల్లెలు నిద్రలేస్తున్నాయి. ఉదయిస్తే ఈ దేశంలో ఉన్న కుళ్ళును చూడవలసి వస్తుందేమోనన్న భయమో, సిగ్గో తూరుపు దిక్కున సంజకెంజాయ రంగులో దోబూచులాడుతున్నాడు. ఇంకా మండీ మండని సూరీడు. ఆ సమయంలో ఆరడుగుల అందగాడు, యౌవనం ద్వితీయ పాదంలో ఉన్నవాడు, బంగారు మేని చాయవాడు, అరవింద నేత్రుడు, సుర్ఫద్రూపి - కృష్ణమాచార్యులు కాలవగట్టు మీదుగా నడిచి వస్తున్నాడు సంధ్యావందనానికి.
ఠీవిగా నడిచి వెళుతుంటే వెనక విశాలమైన వీపు మెడమీదుగా వచ్చి భూజాలను తాకుతున్న గోష్పాదం కనిపిస్తున్నాయి. అలా నడిచి వెళ్ళడం అతని దైనందిన కృత్యమే కానీ, అతనికి తెలియదు ఈ రోజు ఒక సంఘటన జరగబోతోందని, ఆ సంఘటన చందమామలో మచ్చల అతని వెలుగును వెక్కిరిస్తుందని, సూర్యుడు అగ్నిలా అతని గుండెల్ని మండిస్తూనే ఉంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
తూర్పు తెల తెల వారుతోంది. పట్టణాలింకా భారంగానే ఊపిరి తీస్తున్నాయి. పల్లెలు నిద్రలేస్తున్నాయి. ఉదయిస్తే ఈ దేశంలో ఉన్న కుళ్ళును చూడవలసి వస్తుందేమోనన్న భయమో, సిగ్గో తూరుపు దిక్కున సంజకెంజాయ రంగులో దోబూచులాడుతున్నాడు. ఇంకా మండీ మండని సూరీడు. ఆ సమయంలో ఆరడుగుల అందగాడు, యౌవనం ద్వితీయ పాదంలో ఉన్నవాడు, బంగారు మేని చాయవాడు, అరవింద నేత్రుడు, సుర్ఫద్రూపి - కృష్ణమాచార్యులు కాలవగట్టు మీదుగా నడిచి వస్తున్నాడు సంధ్యావందనానికి. ఠీవిగా నడిచి వెళుతుంటే వెనక విశాలమైన వీపు మెడమీదుగా వచ్చి భూజాలను తాకుతున్న గోష్పాదం కనిపిస్తున్నాయి. అలా నడిచి వెళ్ళడం అతని దైనందిన కృత్యమే కానీ, అతనికి తెలియదు ఈ రోజు ఒక సంఘటన జరగబోతోందని, ఆ సంఘటన చందమామలో మచ్చల అతని వెలుగును వెక్కిరిస్తుందని, సూర్యుడు అగ్నిలా అతని గుండెల్ని మండిస్తూనే ఉంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.