"కాలచక్ర జ్యోతిషము" నూతన సృష్టి కాదు. ఈ విధానము సనాతనమైనది. పరమేశ్వరుడు స్వయముగా ఈ విధానమును పార్వతిదేవికి బోధించినట్లు శ్రీ పరాశర మహర్షులవారు మైత్రేయునికి తెలిపెను. పరాశరప్రోక్తమగు "బృహత్పరాశరహోరాశాస్త్రము" నందు కాలచక్ర విధానము తెలుపబడియున్నది. దశాభేదాధ్యాయమునందు మహర్షి అనేక విధములగు దశలున్నవని అందు ముఖ్యములైన వింశోత్తరీ, అష్టోత్తరీ మొదలగునవి ముప్పది మూడు దశలను గురించి దెల్పియున్నారు. వీటిలో కాలచక్ర దశను గురించి విస్తరించి దెల్పుట వలన దీని ప్రాధాన్యము తెలియుచున్నది.
జ్యోతిశ్శాస్త్ర నిష్ణాతులు. శాస్త్ర పండితులకీ గ్రంథమునందలి విషయములు సహజము సామాన్యముగాను కనిపించినను జ్యోతిషాసక్తి గల పాఠకుల కింద విషయములు ముఖ్యములు. జిజ్ఞాసాత్మకములుగా దోపకమానవు. ఇందలి విధానముల ద్వారా తమ జాతకములను పరిశీలించుకొన్న కాలచక్ర జ్యోతిష ఫలితముల గొప్పతనమవగతము గాకమానదు. పాఠకులు జ్యోతిష జిజ్ఞాసులు ఇందలి విషయములనవగాహన గావించుకొని ఆచరణయందుంచుకొని తాము ఫలితములను సరిజూచుకొని ఇతరులకు కూడా దెల్పవలెనని ఆకాంక్షించెదము.
- యం సత్యనారాయణ సిద్ధాంతి
"కాలచక్ర జ్యోతిషము" నూతన సృష్టి కాదు. ఈ విధానము సనాతనమైనది. పరమేశ్వరుడు స్వయముగా ఈ విధానమును పార్వతిదేవికి బోధించినట్లు శ్రీ పరాశర మహర్షులవారు మైత్రేయునికి తెలిపెను. పరాశరప్రోక్తమగు "బృహత్పరాశరహోరాశాస్త్రము" నందు కాలచక్ర విధానము తెలుపబడియున్నది. దశాభేదాధ్యాయమునందు మహర్షి అనేక విధములగు దశలున్నవని అందు ముఖ్యములైన వింశోత్తరీ, అష్టోత్తరీ మొదలగునవి ముప్పది మూడు దశలను గురించి దెల్పియున్నారు. వీటిలో కాలచక్ర దశను గురించి విస్తరించి దెల్పుట వలన దీని ప్రాధాన్యము తెలియుచున్నది. జ్యోతిశ్శాస్త్ర నిష్ణాతులు. శాస్త్ర పండితులకీ గ్రంథమునందలి విషయములు సహజము సామాన్యముగాను కనిపించినను జ్యోతిషాసక్తి గల పాఠకుల కింద విషయములు ముఖ్యములు. జిజ్ఞాసాత్మకములుగా దోపకమానవు. ఇందలి విధానముల ద్వారా తమ జాతకములను పరిశీలించుకొన్న కాలచక్ర జ్యోతిష ఫలితముల గొప్పతనమవగతము గాకమానదు. పాఠకులు జ్యోతిష జిజ్ఞాసులు ఇందలి విషయములనవగాహన గావించుకొని ఆచరణయందుంచుకొని తాము ఫలితములను సరిజూచుకొని ఇతరులకు కూడా దెల్పవలెనని ఆకాంక్షించెదము. - యం సత్యనారాయణ సిద్ధాంతి© 2017,www.logili.com All Rights Reserved.