తొలి పలుకు
మనం పుట్టినప్పటినుంచి పెద్దల ద్వారాగానీ, గురువుల ద్వారాగానీ, మస్తకాల ద్వారాగానీ ఎన్నో విషయాలను తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. మతాలగురించి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి, యజ్ఞ యాగాదుల గురించి, మంత్రాల గురించి, తంత్రాల గురించి, యంత్రాల గురించి అనేక విషయాలను తెలుసుకున్నాం. ఋషులు, మునులు, మహా యోగులు, ద్రష్టల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాం. అయితే, వీళ్ళందరూ నిజంగా ఉన్నారా? లేక అది అసత్యమా? మనం చేస్తున్న పూజలు, చదువుతున్న మంత్రాలు, చేస్తున్న తంత్రాలు, యంత్రాలు - ఇవన్నీ మనల్ని నిజమైన 'గమ్యానికి' తీసుకెళుతున్నాయా? దేవుళ్ళలో ఆడ దేవతలు, మగ దేవుళ్ళను వివిధ పేర్లతో, రూపాలతో పూజిస్తున్నాం. ఇవన్నీ నిజమా? సృష్టిలో ఈ తేడాలన్నీ ఎందుకున్నాయి? సృష్టిలో ధన ధృవము, ఋణ ధృవము అని రెండు వేరుగా ఎందుకున్నాయి? సానుకూల (పాజిటివ్), ప్రతికూల (నెగెటివ్) స్థితులు ఎందుకున్నాయి? వీటన్నిటి ప్రాథమిక స్థిరత్వం ఏమిటి? ధన, ఋణ ధృవాలు అని చెప్పుకోబడేవి ఒకే సృష్టినుంచి వచ్చినవే కదా! అయినప్పుడు వాటి మధ్య తేడా ఎందుకు ఉంది? '0' నుంచి అనంత శూన్యం (ఇన్ఫినిటీ) అంతా ఈ సృష్టినుంచి వచ్చిందే కదా! ఏది తక్కువ? ఏది ఎక్కువ? ఈ నిగూఢమైన భేదం ఏమిటి? ఈ విధంగా వేరుగా చూసే మన దృక్కోణంలో సాక్షీభావన ఏదైనా ఉందా? 'పర ఆత్మ' లేక 'ఆత్మ', జాగరూకత (చేతన స్థితి) అనేవి ఉన్నాయా?...............
- స్వామి మైత్రేయ
తొలి పలుకు మనం పుట్టినప్పటినుంచి పెద్దల ద్వారాగానీ, గురువుల ద్వారాగానీ, మస్తకాల ద్వారాగానీ ఎన్నో విషయాలను తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. మతాలగురించి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి, యజ్ఞ యాగాదుల గురించి, మంత్రాల గురించి, తంత్రాల గురించి, యంత్రాల గురించి అనేక విషయాలను తెలుసుకున్నాం. ఋషులు, మునులు, మహా యోగులు, ద్రష్టల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాం. అయితే, వీళ్ళందరూ నిజంగా ఉన్నారా? లేక అది అసత్యమా? మనం చేస్తున్న పూజలు, చదువుతున్న మంత్రాలు, చేస్తున్న తంత్రాలు, యంత్రాలు - ఇవన్నీ మనల్ని నిజమైన 'గమ్యానికి' తీసుకెళుతున్నాయా? దేవుళ్ళలో ఆడ దేవతలు, మగ దేవుళ్ళను వివిధ పేర్లతో, రూపాలతో పూజిస్తున్నాం. ఇవన్నీ నిజమా? సృష్టిలో ఈ తేడాలన్నీ ఎందుకున్నాయి? సృష్టిలో ధన ధృవము, ఋణ ధృవము అని రెండు వేరుగా ఎందుకున్నాయి? సానుకూల (పాజిటివ్), ప్రతికూల (నెగెటివ్) స్థితులు ఎందుకున్నాయి? వీటన్నిటి ప్రాథమిక స్థిరత్వం ఏమిటి? ధన, ఋణ ధృవాలు అని చెప్పుకోబడేవి ఒకే సృష్టినుంచి వచ్చినవే కదా! అయినప్పుడు వాటి మధ్య తేడా ఎందుకు ఉంది? '0' నుంచి అనంత శూన్యం (ఇన్ఫినిటీ) అంతా ఈ సృష్టినుంచి వచ్చిందే కదా! ఏది తక్కువ? ఏది ఎక్కువ? ఈ నిగూఢమైన భేదం ఏమిటి? ఈ విధంగా వేరుగా చూసే మన దృక్కోణంలో సాక్షీభావన ఏదైనా ఉందా? 'పర ఆత్మ' లేక 'ఆత్మ', జాగరూకత (చేతన స్థితి) అనేవి ఉన్నాయా?............... - స్వామి మైత్రేయ© 2017,www.logili.com All Rights Reserved.