'మహిమల మర్మాలు' రచనకు సంబంధించి పాఠకులకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఇందులోని ఆయా ట్రిక్ లను ప్రదర్శించే వ్యక్తులు - బాబాలు, భగవాన్ లూ, స్వామీజీలూ, అమ్మలూ, గారడీవాళ్ళూ, తదితరులూఒ అన్ని రకాల ప్రదర్శనలనూ 'కపటి' అనీ, వారి ప్రదర్శనలోని అద్భుతాన్ని 'మహిమ' అని పేర్కొన్నాను. అనంతరం ఆ మహిమలోని రహస్యాన్ని మర్మం పేరున వివరించాను. కాగా ప్రతి అంశంలోనూ మర్మం అనేది క్లుప్తంగా మాత్రమే తెలిపాను. వాటిని పాఠకులకు వెల్లడి చేయడం కోసమే తప్ప, వాటిని వారు నేర్చుకోవడం కోసం కాదు. నేర్పడం కోసమే అయితే ప్రతి ట్రిక్ కూ నేను మరింత వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
ఉదాహరణకు 'నిప్పుల మీద నడక' లో ఒక వేళ పొరపాటున కాళ్ళు కొద్దిగా కాలితే సంరక్షించుకోవటం కోసం 'బర్నాల్'ను కూడా సిద్ధం చేసుకుని ఉండాలి - అని నేను సూచించాలి. కాని నేను ఈ అంశాలను వ్రాసింది వాటిని ప్రదర్శించమని కాదు. అందుకే అక్కడ నేను 'బర్నాల్' ను ప్రస్తావించలేదు. నేర్చుకునే విధంగా మహిమలను వివరించటంలో సమాజానికి ఒకోసారి అపకారం కూడా జరుగుతుంది. మహిమల పేరున జనాలను మోసగించే స్వభావం కల వ్యక్తులు ఆ ట్రిక్స్ ను ప్రాక్టీసు చేస్తారు. ప్రజలపై ప్రయోగిస్తారు. ప్రజలను చైతన్యవంతులను చేయటానికీ, వారిని అంధ విశ్వాసాల బారినుండి రక్షించటానికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది.
'మహిమల మర్మాలు' రచనకు సంబంధించి పాఠకులకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఇందులోని ఆయా ట్రిక్ లను ప్రదర్శించే వ్యక్తులు - బాబాలు, భగవాన్ లూ, స్వామీజీలూ, అమ్మలూ, గారడీవాళ్ళూ, తదితరులూఒ అన్ని రకాల ప్రదర్శనలనూ 'కపటి' అనీ, వారి ప్రదర్శనలోని అద్భుతాన్ని 'మహిమ' అని పేర్కొన్నాను. అనంతరం ఆ మహిమలోని రహస్యాన్ని మర్మం పేరున వివరించాను. కాగా ప్రతి అంశంలోనూ మర్మం అనేది క్లుప్తంగా మాత్రమే తెలిపాను. వాటిని పాఠకులకు వెల్లడి చేయడం కోసమే తప్ప, వాటిని వారు నేర్చుకోవడం కోసం కాదు. నేర్పడం కోసమే అయితే ప్రతి ట్రిక్ కూ నేను మరింత వివరణ ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు 'నిప్పుల మీద నడక' లో ఒక వేళ పొరపాటున కాళ్ళు కొద్దిగా కాలితే సంరక్షించుకోవటం కోసం 'బర్నాల్'ను కూడా సిద్ధం చేసుకుని ఉండాలి - అని నేను సూచించాలి. కాని నేను ఈ అంశాలను వ్రాసింది వాటిని ప్రదర్శించమని కాదు. అందుకే అక్కడ నేను 'బర్నాల్' ను ప్రస్తావించలేదు. నేర్చుకునే విధంగా మహిమలను వివరించటంలో సమాజానికి ఒకోసారి అపకారం కూడా జరుగుతుంది. మహిమల పేరున జనాలను మోసగించే స్వభావం కల వ్యక్తులు ఆ ట్రిక్స్ ను ప్రాక్టీసు చేస్తారు. ప్రజలపై ప్రయోగిస్తారు. ప్రజలను చైతన్యవంతులను చేయటానికీ, వారిని అంధ విశ్వాసాల బారినుండి రక్షించటానికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.