"ఈ రోజుల్లో కూడా దయ్యాలు ఉంటాయా?" అని కొందరు, "మానసిక రోగాలు ఉన్నవారే దయ్యాలు ఉన్నాయాని" నమ్ముతారని కొందరు, "దయ్యాలు ఉన్నాయని నమ్మటం వెనకబడినతనం" అని కొందరు వాదిస్తూ ఉంటారు. నిజంగా దయ్యాలు ఉంటే మాకు ఏదో ఒక సమయంలో కనపడి ఉండేవి కాదా? అని కొందరు ఆస్తికులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఎంతో పెద్ద మహానగరం కూడా అర్ధరాత్రి దాటిన తరువాత నిర్మానుష్యంగా మారిపోతుంది. అలాంటి సమయంలో దొంగలు, సంఘవిద్రోహశక్తులు ఆ మహానగర వీధుల్లో విశ్రుంఖలంగా సంచరిస్తూ ఉంటారు.
ఇక ఈ పుస్తకం విషయానికొస్తే ఈ పుస్తకానికి "ఊర్వశి" అని పేరు పెట్టటం జరిగింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక తాంత్రిక విధానం పేరు "ఊర్వశి". నిజానికి ఈ 'ఊర్వశి' ప్రేతాత్మల్ని ఆహ్వానించే ఒక విద్య అని చెప్పవచ్చు. ఇక ఈ ఊర్వశి విద్యలో పరిపూర్ణతను సాధించినవారు ఈ విద్యను ఉపయోగించి ఇతరులపై క్షుద్ర ప్రయోగాలను కూడా చెయ్యగలరు. కేరళకు చెందిన యక్షి అనే పిశాచితో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీ పిశాచాల పట్ల ఉన్న విశ్వాసాల గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ "ఊర్వశి" అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది. ఇప్పటి వరకు నేను వ్రాసిన అనేక పిశాచ సంబంధ గ్రంథాలలోలేని కొత్త సమాచారాన్ని ఈ "ఊర్వశి" లో ఇవ్వటానికి ప్రయత్నించాను. నా ప్రయత్న ఫలితంగా విడుదలైన ఈ పుస్తకం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
- శ్రీధరన్ కండూరి
"ఈ రోజుల్లో కూడా దయ్యాలు ఉంటాయా?" అని కొందరు, "మానసిక రోగాలు ఉన్నవారే దయ్యాలు ఉన్నాయాని" నమ్ముతారని కొందరు, "దయ్యాలు ఉన్నాయని నమ్మటం వెనకబడినతనం" అని కొందరు వాదిస్తూ ఉంటారు. నిజంగా దయ్యాలు ఉంటే మాకు ఏదో ఒక సమయంలో కనపడి ఉండేవి కాదా? అని కొందరు ఆస్తికులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఎంతో పెద్ద మహానగరం కూడా అర్ధరాత్రి దాటిన తరువాత నిర్మానుష్యంగా మారిపోతుంది. అలాంటి సమయంలో దొంగలు, సంఘవిద్రోహశక్తులు ఆ మహానగర వీధుల్లో విశ్రుంఖలంగా సంచరిస్తూ ఉంటారు. ఇక ఈ పుస్తకం విషయానికొస్తే ఈ పుస్తకానికి "ఊర్వశి" అని పేరు పెట్టటం జరిగింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక తాంత్రిక విధానం పేరు "ఊర్వశి". నిజానికి ఈ 'ఊర్వశి' ప్రేతాత్మల్ని ఆహ్వానించే ఒక విద్య అని చెప్పవచ్చు. ఇక ఈ ఊర్వశి విద్యలో పరిపూర్ణతను సాధించినవారు ఈ విద్యను ఉపయోగించి ఇతరులపై క్షుద్ర ప్రయోగాలను కూడా చెయ్యగలరు. కేరళకు చెందిన యక్షి అనే పిశాచితో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీ పిశాచాల పట్ల ఉన్న విశ్వాసాల గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ "ఊర్వశి" అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది. ఇప్పటి వరకు నేను వ్రాసిన అనేక పిశాచ సంబంధ గ్రంథాలలోలేని కొత్త సమాచారాన్ని ఈ "ఊర్వశి" లో ఇవ్వటానికి ప్రయత్నించాను. నా ప్రయత్న ఫలితంగా విడుదలైన ఈ పుస్తకం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. - శ్రీధరన్ కండూరి© 2017,www.logili.com All Rights Reserved.