ప్రాచీన భారతదేశంలోని అనేక శాస్త్రాలలో ఆయుర్వేదం ఒకటి. అప్పటి మునులు, ఋషులు వీళ్ళందరూ వాళ్ళ 'ఇన్ ట్యూజన్'తో అన్నీ 'దర్శించి' మనకి అందించారు. అందుకే ఆనాటి ఆచార్య 'చరకుడు' వాడిన మందులే నేటికీ ఆయుర్వేద వైద్యులు వాడుతున్నారు. ఆయన సిద్ధాంతాలే నేటికీ అందరికీ శిరోధార్యాలు. ప్రస్తుతం మనకి అందుబాటులోని 'ఆధునిక వైద్యశాస్త్రం' సైన్స్ పై ఆధారపడినది. దీంట్లో సిద్ధాంతాలు, మందులు రోజురోజుకి మారిపోతూ ఉంటాయి. ఇవేళ కరెక్ట్ అనుకున్నది రేపు తప్పయ్యే అవకాశం ఉంది. అది దాని లక్షణం. తప్పని కాదు. ఒకప్పుడు 'సంజీవని' అనుకున్న పెన్సిలిన్ నేడు ఎందుకు పనిచేయడం లేదు?
'సిప్రోఫ్లాక్ససిన్' విషయం కూడా అంతే.. కానీ ఆయుర్వేదం అట్లాకాదు. క్రీ పూ చెప్పిన వైద్యవిధానమే కదా పనిచేస్తుంది. ఎక్కడా తప్పడం లేదు! ఇదే ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం. అన్నీ అప్పటివే.. ఇంకా కొత్తవి ఏమీ లేవు. ఇది పరిపూర్ణం. దీనికి మనం చెర్చాల్సిందేం లేదు. ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే చాలు.దీనిని విమర్శించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మన జ్ఞానం సరిపోదు. ఆయుర్వేదం పంచభూత సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దాన్నే ఆధారం చేసుకుని వాత, పిత్త, కఫాలు ధాతువులు.. గుణాలు, రసాలు.. ఇవన్నీ ఎంతో పకడ్బందీగా కూర్చిన శాస్త్రం.
అలాంటి ఆయుర్వేదాన్ని నా పరిధిలో నేను అర్థం చేసుకున్నది, చదివింది, మిగతావాళ్ళకి చెప్పాలనుకున్నది ఈ రకంగా ప్రస్తుతం ఈ పుస్తక రూపంలో చెప్పడానికి ప్రయత్నించాను.
ప్రాచీన భారతదేశంలోని అనేక శాస్త్రాలలో ఆయుర్వేదం ఒకటి. అప్పటి మునులు, ఋషులు వీళ్ళందరూ వాళ్ళ 'ఇన్ ట్యూజన్'తో అన్నీ 'దర్శించి' మనకి అందించారు. అందుకే ఆనాటి ఆచార్య 'చరకుడు' వాడిన మందులే నేటికీ ఆయుర్వేద వైద్యులు వాడుతున్నారు. ఆయన సిద్ధాంతాలే నేటికీ అందరికీ శిరోధార్యాలు. ప్రస్తుతం మనకి అందుబాటులోని 'ఆధునిక వైద్యశాస్త్రం' సైన్స్ పై ఆధారపడినది. దీంట్లో సిద్ధాంతాలు, మందులు రోజురోజుకి మారిపోతూ ఉంటాయి. ఇవేళ కరెక్ట్ అనుకున్నది రేపు తప్పయ్యే అవకాశం ఉంది. అది దాని లక్షణం. తప్పని కాదు. ఒకప్పుడు 'సంజీవని' అనుకున్న పెన్సిలిన్ నేడు ఎందుకు పనిచేయడం లేదు? 'సిప్రోఫ్లాక్ససిన్' విషయం కూడా అంతే.. కానీ ఆయుర్వేదం అట్లాకాదు. క్రీ పూ చెప్పిన వైద్యవిధానమే కదా పనిచేస్తుంది. ఎక్కడా తప్పడం లేదు! ఇదే ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం. అన్నీ అప్పటివే.. ఇంకా కొత్తవి ఏమీ లేవు. ఇది పరిపూర్ణం. దీనికి మనం చెర్చాల్సిందేం లేదు. ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే చాలు.దీనిని విమర్శించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మన జ్ఞానం సరిపోదు. ఆయుర్వేదం పంచభూత సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దాన్నే ఆధారం చేసుకుని వాత, పిత్త, కఫాలు ధాతువులు.. గుణాలు, రసాలు.. ఇవన్నీ ఎంతో పకడ్బందీగా కూర్చిన శాస్త్రం. అలాంటి ఆయుర్వేదాన్ని నా పరిధిలో నేను అర్థం చేసుకున్నది, చదివింది, మిగతావాళ్ళకి చెప్పాలనుకున్నది ఈ రకంగా ప్రస్తుతం ఈ పుస్తక రూపంలో చెప్పడానికి ప్రయత్నించాను.© 2017,www.logili.com All Rights Reserved.