మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనవి వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని ఇవి నాలుగు. వీటిలో చివరిదైన అధర్వణ వేదం మిగిలిన మూడు వేదాలకన్నా ఒక ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకుంది. ఈ అధర్వణవేదంలో ఎన్నో రకాల ఔషధులు వాటి ఉపయోగాలు, వివిధ రకాల రోగాలను నివారించే మంత్ర, తంత్ర, మూలికల విజ్ఞానం పొందుపరచబడింది. ఆయుర్వేదం అనేది ఈ అధర్వణ వేదంలో అంతర్గతంగా చెప్పబడిందే. షడ్డర్శనాలైన సాఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పుర్వమీమాంస, ఉత్తరమీమాంస మరియు జ్యోతిషం, వంటి శాస్త్ర గ్రంథాల మీద ఆయుర్వేదం ఆధారపడి వుందని పండితులు చెప్తారు. దేవవైద్యుడైన ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానానికి మూలపురుషుడుగా పూజించబడుతున్నాడు.
శరీరం, ఇంద్రియాలు, ఆత్మ కలసి ఉండటమే ఆయువు. ఈ ఆయువును పొందటం దీని గురించి తెలుసుకోవటం అనే దాన్నే ఆయుర్వేదం అంటారు. ఈ ఆయుర్వేదంలో శరీరతత్త్వాలు, ఋతుచర్యలు, రోగ నిర్ధారణా పద్ధతులు, రోగాలను నివారించే వివిధ రకాల మూలికా చికిత్సలు, శాస్త్ర చికిత్సలు వంటి ఎన్నో విశేషాలు పొందుపరచబడ్డాయి ఇంత గొప్పదైన ఆయుర్వేదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మహా వైద్యులు ఎందరో వున్నారు.
- డా. జయంతి చక్రవర్తి