ఆయుర్వేదము ఆదికాలము నుండి మన్నన పొందుతూ భారతదేశమున మిక్కిలిగా ఆచరింపబడుచున్నది. ఇప్పటికిని పాశ్చాత్య వైద్య విధానము అందుబాటులో లేని గ్రామములందు, గిరిజన ప్రాంతములందు, ప్రకృతినుండి లభించిన ఓషధి వైద్య విధానమునే ఆశ్రయించి, కృతకృత్యులగుచున్నారు. మిక్కుటముగాకొనసాగే ఈ వైద్య విధానమును ఇప్పడిప్పుడే దీని విలువలను గమనించి పరిశోధనలను గావించిన ప్రాశ్చత్యుల నోటనే ఇందలి సత్యములను వెల్లడించుటను వినిన భారతీయులే కనులు తెరచి ఈ ఆయుర్వేద వైద్య విధానము పట్ల బహుళ ప్రచారము గావించుచున్నారు. పరోపకారార్ధమిదం శరీరం అనుస్త్రుతి వాక్యము ననుసరించి పలువురు సామాన్య ప్రజానీకమునకు ప్రయోజనకారిగా నుండ వలెనను ఉద్దేశముతో ఈ వైద్యగ్రంధము నందలి విషయము లన్నియు అనుభవజ్ఞులైన వైద్యులచే చెప్పబడిన ప్రాచీన, నవీన గ్రంధముల నుండి సేకరించి పాఠకులకు అందించదమైనది.
కె. రామకృష్ణారెడ్డి
ఆయుర్వేదము ఆదికాలము నుండి మన్నన పొందుతూ భారతదేశమున మిక్కిలిగా ఆచరింపబడుచున్నది. ఇప్పటికిని పాశ్చాత్య వైద్య విధానము అందుబాటులో లేని గ్రామములందు, గిరిజన ప్రాంతములందు, ప్రకృతినుండి లభించిన ఓషధి వైద్య విధానమునే ఆశ్రయించి, కృతకృత్యులగుచున్నారు. మిక్కుటముగాకొనసాగే ఈ వైద్య విధానమును ఇప్పడిప్పుడే దీని విలువలను గమనించి పరిశోధనలను గావించిన ప్రాశ్చత్యుల నోటనే ఇందలి సత్యములను వెల్లడించుటను వినిన భారతీయులే కనులు తెరచి ఈ ఆయుర్వేద వైద్య విధానము పట్ల బహుళ ప్రచారము గావించుచున్నారు. పరోపకారార్ధమిదం శరీరం అనుస్త్రుతి వాక్యము ననుసరించి పలువురు సామాన్య ప్రజానీకమునకు ప్రయోజనకారిగా నుండ వలెనను ఉద్దేశముతో ఈ వైద్యగ్రంధము నందలి విషయము లన్నియు అనుభవజ్ఞులైన వైద్యులచే చెప్పబడిన ప్రాచీన, నవీన గ్రంధముల నుండి సేకరించి పాఠకులకు అందించదమైనది. కె. రామకృష్ణారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.