ఆయుర్వేద వైద్య మత్యంత ప్రాచీనమైనది. ఈ వైద్య శాస్త్రము వేదాలనుండి గ్రహింపబడినది ఈ శాస్త్రమునకు ధన్వంత్రి అశ్వనీ దేవతలు మూలపురుషులు. 'మలజారీ రోగహారీ' అనే సూక్తి వలన మలబద్ధకం లేకపోతె వ్యాధులే దరిజేరవని తెలుస్తుంది. ప్రకృతిలో మనకు కనిపించే అనేక మూలికలతో అనేక వ్యాధులు నివారించవచ్చు. అర్క(జిల్లేడు) ధూత్తూర(ఉమ్మెత్త) శారి బాద్య(సుగంధిపాల) శాల్మలి(బూరుగు) పునర్నవ(గలిజేరు) దాడిమ(దానిమ్మ) నింబ(వేప) ఆమ్ల(ఉసిరి) భ్రుంగ(గుంటకలగర) ఇటువంటి ఎన్నో ఓషధులు మనకు ప్రకృతిలో లభిస్తాయి. వానివలన మనకెన్నో ఉపయోగాలున్నాయి. ఒక్క నేలతంగేడాకును ఆనుపాన భేదంతోవాడితే, 360 రోగాలను పాగోడు తుందంటే ఆయుర్వేద వైద్యంలోని గొప్పతనమేంటో మనకర్ధమౌతుంది.
ప్రాచీన మహర్షులెందరో తమపేర్లతో గ్రంధాలనే వెలువరించారు. అట్టివానిలో 'అగస్త్యమూలికా మర్మశాస్త్రం' ఒకటి. చ్యవన మహర్షి తన పేరులో "చ్యవనప్రాస" లేహ్యం తయారుచేసి వాడి యువకుడైనాడని ప్రసిద్ధి. ఈ వైద్యశాస్త్రంలో చిట్కావైద్యమత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. ఈ చిట్కాలను విష్ణుమూర్తి బైరాగితో చెప్పాడని వాడుక. ప్రాచీన వైద్య గ్రంధాలనెన్నిటినో పరిశీలించి, విలువైన చిట్కాల నెన్నిటినో గుదిగ్రుచ్చి, ప్రజల కందిచాలనే సత్సంకల్పంతో ఈ గ్రంధాన్ని రూపొందించాను.
- అడుగుల రామయాచారి
ఆయుర్వేద వైద్య మత్యంత ప్రాచీనమైనది. ఈ వైద్య శాస్త్రము వేదాలనుండి గ్రహింపబడినది ఈ శాస్త్రమునకు ధన్వంత్రి అశ్వనీ దేవతలు మూలపురుషులు. 'మలజారీ రోగహారీ' అనే సూక్తి వలన మలబద్ధకం లేకపోతె వ్యాధులే దరిజేరవని తెలుస్తుంది. ప్రకృతిలో మనకు కనిపించే అనేక మూలికలతో అనేక వ్యాధులు నివారించవచ్చు. అర్క(జిల్లేడు) ధూత్తూర(ఉమ్మెత్త) శారి బాద్య(సుగంధిపాల) శాల్మలి(బూరుగు) పునర్నవ(గలిజేరు) దాడిమ(దానిమ్మ) నింబ(వేప) ఆమ్ల(ఉసిరి) భ్రుంగ(గుంటకలగర) ఇటువంటి ఎన్నో ఓషధులు మనకు ప్రకృతిలో లభిస్తాయి. వానివలన మనకెన్నో ఉపయోగాలున్నాయి. ఒక్క నేలతంగేడాకును ఆనుపాన భేదంతోవాడితే, 360 రోగాలను పాగోడు తుందంటే ఆయుర్వేద వైద్యంలోని గొప్పతనమేంటో మనకర్ధమౌతుంది. ప్రాచీన మహర్షులెందరో తమపేర్లతో గ్రంధాలనే వెలువరించారు. అట్టివానిలో 'అగస్త్యమూలికా మర్మశాస్త్రం' ఒకటి. చ్యవన మహర్షి తన పేరులో "చ్యవనప్రాస" లేహ్యం తయారుచేసి వాడి యువకుడైనాడని ప్రసిద్ధి. ఈ వైద్యశాస్త్రంలో చిట్కావైద్యమత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. ఈ చిట్కాలను విష్ణుమూర్తి బైరాగితో చెప్పాడని వాడుక. ప్రాచీన వైద్య గ్రంధాలనెన్నిటినో పరిశీలించి, విలువైన చిట్కాల నెన్నిటినో గుదిగ్రుచ్చి, ప్రజల కందిచాలనే సత్సంకల్పంతో ఈ గ్రంధాన్ని రూపొందించాను. - అడుగుల రామయాచారిso happy
© 2017,www.logili.com All Rights Reserved.