"ఇదం ప్రమాణoతే శాస్త్రం" ఏదైనా శాస్త్రం ప్రకారం చేస్తే ఆపని సవ్యంగాను, ఖచ్చితంగాను జరుగుతుందని శాస్త్ర వాక్యము. పురాతన హైందవ సంస్కృతి, సంప్రదాయాలన్నీ శాస్త్రీయయుక్తమై గ్రంధస్తమై ఎప్పటికీ, అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటూ అందరి మన్నలను అందుకోవటం దేశ ప్రజల అదృష్టం. అటువంటి గొప్ప ప్రాచీన శాస్త్రాలలో వైద్యంకు సంబంధించిన పుస్తకాలలోని యోగాలు నేటికీ అవి ఇప్పటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంటే ఎంతటి అపూర్వ విజ్ఞానం వారిది. అటువంటి అపూర్వ విజ్ఞానాన్ని అందరూ పంచుకోవాలని దేశీయ వైద్యం (ఆయుర్వేదం) పై మక్కువతో పాటు శాస్త్రియత కల్గి ఉండాలని జరిగిన కృషియే ఈ సంకలన గ్రంధం. ఈ గ్రంధమునందు పూర్వ వైద్య శిఖామణులు, మహాత్ములు, ఋషులు మొదలైనవారి గ్రంధములలో గల ఏకమూలికా విధానాలు ఇందులో చేర్చటం జరిగింది.
- వైద్య శ్రీ లొల్ల రామచంద్రరావు