ఆయువుని గూర్చి తెలియజేసే విజ్ఞానాన్ని ఆయుర్వేదమంటారు. ఈ అర్ధం తెలుసుకున్న వెంటనే వచ్చే ప్రశ్న "ఎవరు ఆయువు గురించి?" దానికి సమాధానం మనిషి యొక్క ఆయువు గూర్చే అని గ్రహించాలి. వృక్షయుర్వేదం, హస్త్యయుర్వేదం అన్న పేర్లతో అనేక విభిన్న శాస్త్ర విజ్ఞాన శాఖాలు పూర్వకాలంలోనే పరిఢవిల్లాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయుర్వేద శబ్దాన్ని ఆంగ్లంలో తర్జుమా చేసేటప్పుడు తరచూ చాలామంది "Ancient Science Of Life " అని వివరిస్తారు. కానీ ఇది సరైన తర్జుమా కాదు. ఈ శాస్త్రానికి 'Ancient " అంటే పురాతన అనే శబ్దం చేర్చేనవసరం లేదు . నేడు జరుగుతున్న అత్యాధునిక వైద్యశాస్త్ర పారిశోధనలు ఆయుర్వేద శాస్త్ర విషయాలు సశాస్త్రియమేనని విశ్లేషించి వివరిస్తూ వుంటే ఈ ప్రాచీన వైద్య శాస్త్రం అత్యంత నవీనమైనది మరియు త్రికాలములందు సమాజానికి తగిన శాస్త్రంగా గ్రహించాల్సి వస్తుంది.