నైమిశారణ్యమున మునులందరూ వారి వారి శిష్యగణంతో చేరి మహావిష్ణువును ఆరాధిస్తున్నారు. ఒకరోజు వారంతా ఒకచోట చేరి మనమీ విధంగా కాలం గడుపుతున్నాం కాని ఈ సృష్టికి కారణం ఎవరు? సృష్టి రచనలో ఉన్న ఈ భూలోకములో ఏవి పుణ్యనదులు, ఏవేవి పుణ్యక్షేత్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి? పరమాత్మ సృష్టిలో ఉత్తమమైన జన్మ నెత్తిన మనిషి రాగద్వేషాదులతో ఎందుకు లీనమయి మరలా మరలా జననమరణ చక్రములో ఇరుక్కునే ఉంటున్నాడు? నారాయణుని పై మనసు ఎందుకు నిలబడడం లేదు? ఆ శ్రీమన్నారాయణునిపై అచంచలమైన భక్తి ఎట్లా కుదురుకుంటుంది? మనుష్యులు చేసే ఏయే పనుల వల్ల ఏయే ఫలితాలు కలుగుతున్నాయి? మన ఈ సందేహాలన్నింటినీ ఆ సూత మహర్షియే తీర్చును పదండి. నేనూ మీతో వస్తాను అని శౌనకుడు కూడా సూత మహాముని దగ్గరకు బయలుదేరాడు. అలా సిద్ధాశ్రమానికి వెళ్లిన శౌనకాది మహర్షులను సూతమహాముని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్నిచ్చాడు. వారంతా సుఖాశీనులయ్యాక శౌనకాది మహామునులు సూతుడిని తమ సందేహాలను తీర్చుమని అడిగారు. అసలీ సృష్టిరహస్యమేమిటి? ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నది? తిరిగి ఎక్కడ లయమొందు తున్నది? శ్రీమన్నారాయణుని సేవించడానికి......................
వేదవ్యాసవిరచిత సంపూర్ణ శ్రీ నారద మహాపురాణము పూర్వభాగం నారద పురాణ మాహాత్య్మం నైమిశారణ్యమున మునులందరూ వారి వారి శిష్యగణంతో చేరి మహావిష్ణువును ఆరాధిస్తున్నారు. ఒకరోజు వారంతా ఒకచోట చేరి మనమీ విధంగా కాలం గడుపుతున్నాం కాని ఈ సృష్టికి కారణం ఎవరు? సృష్టి రచనలో ఉన్న ఈ భూలోకములో ఏవి పుణ్యనదులు, ఏవేవి పుణ్యక్షేత్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి? పరమాత్మ సృష్టిలో ఉత్తమమైన జన్మ నెత్తిన మనిషి రాగద్వేషాదులతో ఎందుకు లీనమయి మరలా మరలా జననమరణ చక్రములో ఇరుక్కునే ఉంటున్నాడు? నారాయణుని పై మనసు ఎందుకు నిలబడడం లేదు? ఆ శ్రీమన్నారాయణునిపై అచంచలమైన భక్తి ఎట్లా కుదురుకుంటుంది? మనుష్యులు చేసే ఏయే పనుల వల్ల ఏయే ఫలితాలు కలుగుతున్నాయి? మన ఈ సందేహాలన్నింటినీ ఆ సూత మహర్షియే తీర్చును పదండి. నేనూ మీతో వస్తాను అని శౌనకుడు కూడా సూత మహాముని దగ్గరకు బయలుదేరాడు. అలా సిద్ధాశ్రమానికి వెళ్లిన శౌనకాది మహర్షులను సూతమహాముని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యాన్నిచ్చాడు. వారంతా సుఖాశీనులయ్యాక శౌనకాది మహామునులు సూతుడిని తమ సందేహాలను తీర్చుమని అడిగారు. అసలీ సృష్టిరహస్యమేమిటి? ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నది? తిరిగి ఎక్కడ లయమొందు తున్నది? శ్రీమన్నారాయణుని సేవించడానికి......................© 2017,www.logili.com All Rights Reserved.