బుద్ధుడు - బౌద్ధ ధమ్మము పీఠిక
లే కాక ప్రపంచంలోని అన్ని బౌద్ధ దేశాలవారు, సిద్ధాంత
భారతదేశంలో గల బౌద్ధులే కాక
వేత్తలు, వివిధ దేశాల మతాధిపతుల కోరికమీద “ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ”, (బుద్ధుడు-బౌద్ధ ధర్మము) అను గ్రంథము యొక్క రెండవ ముద్రణను విడుదల చేస్తున్నాం.
డా॥ అంబేడ్కర్చే రచింపబడిన "బుద్ధుడు - బౌద్ధ ధర్మము" అను గ్రంధము యొక్క తొలిముద్రణ 1957 లో, అనగా అంబేడ్కర్ పరినిర్వాణము చెందిన సంవత్సర కాలంలోనే ప్రచురించగలిగాం. బౌద్ధ ధర్మం పై డా॥ అంబేడ్కర్ చేసిన పూర్తి పరిశీలన భారతీయ బౌద్ధులకు పరిశుద్ద గ్రంధంలా ఉపయోగపడుతున్న కారణంగ ఈ గ్రంధాన్ని హిందీ, మరాఠి భాషల్లో సైతం అనువదించి ప్రచురించడం జరిగింది. ఇది భారతీయ బౌద్ధులచే క్రొత్త నిబంధనగా పరిగణించబడి ఆయా ప్రాంతాల్లో కొందరు విడివిడిగాను, కొన్నిచోట్ల చిన్న కూటములుగాను ఏర్పడి అధ్యయనం చేస్తూ తద్వారా ఎంతో ప్రభావితులు కావడం జరుగుతున్నది. మరే యితర మత గ్రంధాలతో పోల్చడానికైనా వీలుగాని సరిక్రొత్త పంధాలో సూత్రీకరించబడిన ఈ బౌద్ధ గ్రంధం పాఠకుల కెంతో ఉత్సాహాన్ని కలిగించింది.
క్రీస్తు పూర్వం 588వ సంవత్సరంలో, వైశాఖ పూర్ణిమ, బుధవారం నాడు పరిపూర్ణ జ్ఞానోదయుడైన బుద్ధుడు మానవుడనుభవించే బాధలకు మూల కారణాన్ని, ఆ భాధలకు కారణమైన అసలు సత్యాన్ని, వాటినుండి విముక్తి పొందడమంటే ఏమిటన్న వాస్తవాన్ని, అందుకై మానవుడనుసరించవలసిన మార్గాన్ని గూర్చి నలభై అయిదేళ్ళపాటు ప్రజలకు ప్రబోధం చేశాడు. ఈ ధర్మచక్ర ప్రవర్తనా సూత్రాలను బుద్ధుడు తొలుత ఐదుగురు పరివ్రాజకులకు బోధించి వారిని బౌద్ధులుగా మార్చి ఈ తర్వాత కాశీ పట్టణానికి చేరువలో గల సారనాధ్ వద్ద యశునికి, అతని యాబై నలుగురు సహచరులకు బోధించి వారు అరహతులు అవగా తన సంఘంలో చేర్చుకొన్నాడు. ఈ విధంగా నలభై అయిదేళ్ల పాటు ధర్మప్రబోధనను కొనసాగించి అ తరువాత కుశీనగర పాలకులైన మల్లరాజును, సుభద్రుడిని అరహతులుగా మార్చి వైశాఖ పౌర్ణమి రోజున మహాపరినిర్వాణం చెందాడు. అయితే అనాటికి బౌద్ధ ధర్మం గంగానదీతీరం వరకు మాత్రమే వ్యాపించి యుండినది. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన తరువాత తన అస్తికలను ఉత్తర మధ్యభారతదేశంలోని రాజులందరికీ పంపకం చేయగ వారు.................
బుద్ధుడు - బౌద్ధ ధమ్మము పీఠిక లే కాక ప్రపంచంలోని అన్ని బౌద్ధ దేశాలవారు, సిద్ధాంత భారతదేశంలో గల బౌద్ధులే కాక వేత్తలు, వివిధ దేశాల మతాధిపతుల కోరికమీద “ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ”, (బుద్ధుడు-బౌద్ధ ధర్మము) అను గ్రంథము యొక్క రెండవ ముద్రణను విడుదల చేస్తున్నాం. డా॥ అంబేడ్కర్చే రచింపబడిన "బుద్ధుడు - బౌద్ధ ధర్మము" అను గ్రంధము యొక్క తొలిముద్రణ 1957 లో, అనగా అంబేడ్కర్ పరినిర్వాణము చెందిన సంవత్సర కాలంలోనే ప్రచురించగలిగాం. బౌద్ధ ధర్మం పై డా॥ అంబేడ్కర్ చేసిన పూర్తి పరిశీలన భారతీయ బౌద్ధులకు పరిశుద్ద గ్రంధంలా ఉపయోగపడుతున్న కారణంగ ఈ గ్రంధాన్ని హిందీ, మరాఠి భాషల్లో సైతం అనువదించి ప్రచురించడం జరిగింది. ఇది భారతీయ బౌద్ధులచే క్రొత్త నిబంధనగా పరిగణించబడి ఆయా ప్రాంతాల్లో కొందరు విడివిడిగాను, కొన్నిచోట్ల చిన్న కూటములుగాను ఏర్పడి అధ్యయనం చేస్తూ తద్వారా ఎంతో ప్రభావితులు కావడం జరుగుతున్నది. మరే యితర మత గ్రంధాలతో పోల్చడానికైనా వీలుగాని సరిక్రొత్త పంధాలో సూత్రీకరించబడిన ఈ బౌద్ధ గ్రంధం పాఠకుల కెంతో ఉత్సాహాన్ని కలిగించింది. క్రీస్తు పూర్వం 588వ సంవత్సరంలో, వైశాఖ పూర్ణిమ, బుధవారం నాడు పరిపూర్ణ జ్ఞానోదయుడైన బుద్ధుడు మానవుడనుభవించే బాధలకు మూల కారణాన్ని, ఆ భాధలకు కారణమైన అసలు సత్యాన్ని, వాటినుండి విముక్తి పొందడమంటే ఏమిటన్న వాస్తవాన్ని, అందుకై మానవుడనుసరించవలసిన మార్గాన్ని గూర్చి నలభై అయిదేళ్ళపాటు ప్రజలకు ప్రబోధం చేశాడు. ఈ ధర్మచక్ర ప్రవర్తనా సూత్రాలను బుద్ధుడు తొలుత ఐదుగురు పరివ్రాజకులకు బోధించి వారిని బౌద్ధులుగా మార్చి ఈ తర్వాత కాశీ పట్టణానికి చేరువలో గల సారనాధ్ వద్ద యశునికి, అతని యాబై నలుగురు సహచరులకు బోధించి వారు అరహతులు అవగా తన సంఘంలో చేర్చుకొన్నాడు. ఈ విధంగా నలభై అయిదేళ్ల పాటు ధర్మప్రబోధనను కొనసాగించి అ తరువాత కుశీనగర పాలకులైన మల్లరాజును, సుభద్రుడిని అరహతులుగా మార్చి వైశాఖ పౌర్ణమి రోజున మహాపరినిర్వాణం చెందాడు. అయితే అనాటికి బౌద్ధ ధర్మం గంగానదీతీరం వరకు మాత్రమే వ్యాపించి యుండినది. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన తరువాత తన అస్తికలను ఉత్తర మధ్యభారతదేశంలోని రాజులందరికీ పంపకం చేయగ వారు.................© 2017,www.logili.com All Rights Reserved.