స్పూర్తినిచ్చే వ్యక్తులు, స్పూర్తినిచ్చే దృశ్యాలు, స్పూర్తి పొందడానికి అవసరమైన సంఘటనలు మన చుట్టూనే ప్రకృతిలో మమేకమై ఉంటాయని చెపుతారు దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మనిషి తనను తాను నిర్మించుకోవడానికి, సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి పుస్తకాలు ఒక మార్గదర్శిగా, గురువుగా మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ముఖ్యంగా విద్యార్థులు, ఆరోగ్యవంతమైన యువతే ఈ దేశానికి వెన్నెముక. వాళ్లకు ఉపయోగపడి, వాళ్ళలో ‘నేర్చుకోవాలి, తమను తాము మార్చుకోవాలి’ అన్న కోరికను, జిజ్ఞాసను కలిగించే పుస్తకాల అవసరం చాలా ఉంది. విద్యా రంగంలో నాకున్న అపార అనుభవాన్ని ఉపయోగించి వాళ్లకు ఉపయుక్తంగా ఉండి వాళ్ళను ముందుకు నడిపించే పుస్తకాలు రాయాలన్నది నా అభిమతం.
అందుకే ఎన్నో వ్యాపార వ్యాపకాల్లో తలమునకలై ఉన్నా కూడా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. గతంలో నేను ఎన్నో టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నా, పత్రికలకు వ్యాసాలు రాసినా విద్యార్థులకు నా అనుభవం ఉపయోగపడాలన్న తపనతోనే చేశాను. అయితే నా ఆలోచనలను పుస్తకం రూపోంలో తీసుకొస్తే వారికి మరింత ఉపయుక్తంగా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.
‘తనలో ఆకృతి దాల్సిన భావధారల్ని అడుగడుగునా అక్షర అవగాహన చేసుకున్న అంకం ‘పెద్ద బాలశిక్ష’ లాంటి ఈ వ్యాస పరంపరని కానుకగానే యువతకి అందించాడు. నా మిత్రుడు అంకం వ్యక్తిత్వ వికాసం పై రాసిన ఈ పుస్తకాన్ని అభినందిస్తున్నాను. నిజమే, బలంగా ఏదైనా అనుకోండి అది జరిగి తీరుతుంది’.
స్పూర్తినిచ్చే వ్యక్తులు, స్పూర్తినిచ్చే దృశ్యాలు, స్పూర్తి పొందడానికి అవసరమైన సంఘటనలు మన చుట్టూనే ప్రకృతిలో మమేకమై ఉంటాయని చెపుతారు దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మనిషి తనను తాను నిర్మించుకోవడానికి, సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి పుస్తకాలు ఒక మార్గదర్శిగా, గురువుగా మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ముఖ్యంగా విద్యార్థులు, ఆరోగ్యవంతమైన యువతే ఈ దేశానికి వెన్నెముక. వాళ్లకు ఉపయోగపడి, వాళ్ళలో ‘నేర్చుకోవాలి, తమను తాము మార్చుకోవాలి’ అన్న కోరికను, జిజ్ఞాసను కలిగించే పుస్తకాల అవసరం చాలా ఉంది. విద్యా రంగంలో నాకున్న అపార అనుభవాన్ని ఉపయోగించి వాళ్లకు ఉపయుక్తంగా ఉండి వాళ్ళను ముందుకు నడిపించే పుస్తకాలు రాయాలన్నది నా అభిమతం.
అందుకే ఎన్నో వ్యాపార వ్యాపకాల్లో తలమునకలై ఉన్నా కూడా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. గతంలో నేను ఎన్నో టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నా, పత్రికలకు వ్యాసాలు రాసినా విద్యార్థులకు నా అనుభవం ఉపయోగపడాలన్న తపనతోనే చేశాను. అయితే నా ఆలోచనలను పుస్తకం రూపోంలో తీసుకొస్తే వారికి మరింత ఉపయుక్తంగా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం. ‘తనలో ఆకృతి దాల్సిన భావధారల్ని అడుగడుగునా అక్షర అవగాహన చేసుకున్న అంకం ‘పెద్ద బాలశిక్ష’ లాంటి ఈ వ్యాస పరంపరని కానుకగానే యువతకి అందించాడు. నా మిత్రుడు అంకం వ్యక్తిత్వ వికాసం పై రాసిన ఈ పుస్తకాన్ని అభినందిస్తున్నాను. నిజమే, బలంగా ఏదైనా అనుకోండి అది జరిగి తీరుతుంది’.