ఖుద్దకనికాయం - ఉదానపాలి
I. బోధి వర్గం
1. ప్రథమ బోధిసూత్రం
“ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉత్పన్నం కావటం వలన ఇది జనిస్తుంది. ఎలాగంటే - అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూప కారణంగా ఆరు ఆయతనాలు (
జ్ఞానేంద్రియాలు అయిదు + మనస్సు), ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా కృష్ణ కృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదాన కారణంగా భవం, భవం కారణంగా జాతి,
జాతి కారణంగా జరామరణ, శోక, పరిదేవన, దుఃఖ, దౌర్మనస్య, ఉపాయాసాలు కలుగుతున్నాయి. ఈ విధంగా సంపూర్ణదుఃఖస్కంధం పుడుతుంది." అప్పుడు భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఆశువుగా ఈ ఉదానాన్ని వెలువరించాడు -
“ఉత్సాహంతో ధ్యానం చేసే విప్రునకు
ధర్మం ప్రకటం కాగా;
సంశయాలన్నీ శాంతించి అతడు
సహేతుక ధమ్మాన్ని దర్శిస్తాడు." ఇది ఒకటవది,
© 2017,www.logili.com All Rights Reserved.