"ఛన్నా మే కుటికా....." అని సుభూతిథేరుడు పలికిన గాధ ఎలా పుట్టింది? శతసహస్రకల్పాలకి పూర్వం సుభూతి పదుముత్తరబుద్ధుని కాలంలో 'నందుడిగా జన్మించి ఆయనకు పూలు పండ్లు సమర్పించాడు.
ఇంకా అతీత కాలంలో ఎందరో సంబుద్ధులను సందర్శించుకొన్న సుభూతి తావతంస దేవలోకంలో దివ్యసంపత్తిని అనుభవించి అక్కడ నుండి చ్యుతమై మనుష్యలోకంలో చక్రవర్తిగా, రారాజుగా ఎన్నో వందలసార్లు జన్మించి ఇప్పుడు గౌతమబుద్ధుని కాలంలో శ్రావస్తిలో అనాథపిండికుని చిన్నతమ్ముడు సుమన శ్రేష్టి(వ్యాపారి) గృహంలో సుభూతి జన్మించాడు.
ఒకానొక సమయంలో స్వయంగా భగవానుడు ధర్మచక్రప్రవర్తన చేసే క్రమంలో ఉదయాన్నే 'రాజగృహం' లోని వేణువనానికి వెళ్ళి, ఆ రోజు వేణువనాన్ని వదలి లోకాన్ని అనుగ్రహించడం. కోసం రాజగృహం సమీపంలోని సీతవనంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రావస్తి నివాసి అనాథపిండికుడనే శ్రేష్టి ఏదో పనిమీద రాజగృహం లోని ఒక శ్రేష్టి ఇంటికి వచ్చాడు.. బుద్ధుడుద్భవించాడని విని వెంటనే సీతవనం చేరుకొని భగవానుని ప్రథమ దర్శనంలోనే సోతాపత్తిఫలంలో ప్రతిష్ఠితుడయ్యాడు. భగవానుణ్ణి శ్రావస్తికి రావలసిందిగా యాచించాడు. అప్పుడు అనాథపిండికుడు "నలభై ఐదు యోజనాల వైశాల్యం' గలిగిన వంద వేలమంది భిక్షువులు. విహరించగలిగే, శ్రావస్తిరాజకుమారుని ఎనిమిది కరీసల(ఆ రోజుల్లోని భూమినికొలచే ప్రమాణం) వైశాల్యం గల ఉద్యానవనాన్ని, కోటి సంధారాలు బంగారు నాణేలకు కొని ఆరామం నిర్మించాడు. విహార ప్రారంభం రోజున ఆ సుభూతి కుటుంబం సమేతంగా అనాథపిండికునితో కలసి విహారానికి వచ్చాడు.
ధర్మం వినగానే శ్రద్ధ గలిగి ప్రప్రజ్య తీసుకొన్నాడు. మతిమంతుడైనియై ప్రజ్ఞావంతుడై అరణ్యాలకు వెళ్ళి మైత్రీధ్యాన కర్మస్థానాన్ని (భగవానునిచే గ్రహించిన సాధనా విధిని) సాధనచేస్తూ, శ్రమణధర్మాన్ని ఆచరిస్తూ అరహంతుడయ్యాడు. ఏ ధర్మాన్ని శాస్త్ర వద్దనుండి ఉపదేశంగా పొందాడో అదే ధర్మాన్ని, ప్రతిదినం చారిక చేస్తూ ఎలాంటి అవరోధం లేకుండా ధారాళంగా, ఉన్నతంగా ఉపదేశించేవాడు. ఈ విధంగా శాంతిలో విహరిస్తూ ఎల్లవేళలా సమస్త జీవరాశిపట్ల మైత్రీ భావంతో మనలేవాడు. భిక్షకు వెళ్ళేటప్పుడు మార్గంలో మైత్రితోనే నడిచేవాడు. "దాతలందరూ మహాఫలాన్ని పొందుదురుగాక!" అని దీవించేవాడు. "శాంతితో విహరించే నా భిక్షువులలో సుభూతి అగ్రగణ్యుడు............
మొదటి వర్గం సుభూతిథేరగాథ ఒకగాధ నిపాతం "ఛన్నా మే కుటికా....." అని సుభూతిథేరుడు పలికిన గాధ ఎలా పుట్టింది? శతసహస్రకల్పాలకి పూర్వం సుభూతి పదుముత్తరబుద్ధుని కాలంలో 'నందుడిగా జన్మించి ఆయనకు పూలు పండ్లు సమర్పించాడు. ఇంకా అతీత కాలంలో ఎందరో సంబుద్ధులను సందర్శించుకొన్న సుభూతి తావతంస దేవలోకంలో దివ్యసంపత్తిని అనుభవించి అక్కడ నుండి చ్యుతమై మనుష్యలోకంలో చక్రవర్తిగా, రారాజుగా ఎన్నో వందలసార్లు జన్మించి ఇప్పుడు గౌతమబుద్ధుని కాలంలో శ్రావస్తిలో అనాథపిండికుని చిన్నతమ్ముడు సుమన శ్రేష్టి(వ్యాపారి) గృహంలో సుభూతి జన్మించాడు. ఒకానొక సమయంలో స్వయంగా భగవానుడు ధర్మచక్రప్రవర్తన చేసే క్రమంలో ఉదయాన్నే 'రాజగృహం' లోని వేణువనానికి వెళ్ళి, ఆ రోజు వేణువనాన్ని వదలి లోకాన్ని అనుగ్రహించడం. కోసం రాజగృహం సమీపంలోని సీతవనంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రావస్తి నివాసి అనాథపిండికుడనే శ్రేష్టి ఏదో పనిమీద రాజగృహం లోని ఒక శ్రేష్టి ఇంటికి వచ్చాడు.. బుద్ధుడుద్భవించాడని విని వెంటనే సీతవనం చేరుకొని భగవానుని ప్రథమ దర్శనంలోనే సోతాపత్తిఫలంలో ప్రతిష్ఠితుడయ్యాడు. భగవానుణ్ణి శ్రావస్తికి రావలసిందిగా యాచించాడు. అప్పుడు అనాథపిండికుడు "నలభై ఐదు యోజనాల వైశాల్యం' గలిగిన వంద వేలమంది భిక్షువులు. విహరించగలిగే, శ్రావస్తిరాజకుమారుని ఎనిమిది కరీసల(ఆ రోజుల్లోని భూమినికొలచే ప్రమాణం) వైశాల్యం గల ఉద్యానవనాన్ని, కోటి సంధారాలు బంగారు నాణేలకు కొని ఆరామం నిర్మించాడు. విహార ప్రారంభం రోజున ఆ సుభూతి కుటుంబం సమేతంగా అనాథపిండికునితో కలసి విహారానికి వచ్చాడు. ధర్మం వినగానే శ్రద్ధ గలిగి ప్రప్రజ్య తీసుకొన్నాడు. మతిమంతుడైనియై ప్రజ్ఞావంతుడై అరణ్యాలకు వెళ్ళి మైత్రీధ్యాన కర్మస్థానాన్ని (భగవానునిచే గ్రహించిన సాధనా విధిని) సాధనచేస్తూ, శ్రమణధర్మాన్ని ఆచరిస్తూ అరహంతుడయ్యాడు. ఏ ధర్మాన్ని శాస్త్ర వద్దనుండి ఉపదేశంగా పొందాడో అదే ధర్మాన్ని, ప్రతిదినం చారిక చేస్తూ ఎలాంటి అవరోధం లేకుండా ధారాళంగా, ఉన్నతంగా ఉపదేశించేవాడు. ఈ విధంగా శాంతిలో విహరిస్తూ ఎల్లవేళలా సమస్త జీవరాశిపట్ల మైత్రీ భావంతో మనలేవాడు. భిక్షకు వెళ్ళేటప్పుడు మార్గంలో మైత్రితోనే నడిచేవాడు. "దాతలందరూ మహాఫలాన్ని పొందుదురుగాక!" అని దీవించేవాడు. "శాంతితో విహరించే నా భిక్షువులలో సుభూతి అగ్రగణ్యుడు............© 2017,www.logili.com All Rights Reserved.