నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స
దీఘనికాయ - పాథికవర్గం
సునక్బత్తుని విషయం
1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు మల్లదేశంలో అనుపియ అనే పేరుగల మల్లుల పట్టణంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్నసమయంలో చక్కగా కప్పుకొని పాత్రచీవరాలను తీసుకొని అనుపియలో భిక్షకోసం ప్రవేశించాడు. అప్పుడు భగవానునకు ఇలా అనిపించింది - "అనుపియలో భిక్షకు ఇంకా చాలా సమయం ఉంది. (ఈ లోపున) నేను తప్పక భగవగోత్ర పరివ్రాజకుడు ఉండే భగ్గవ (భార్గవ) పరివ్రాజక ఆరామానికి వెళ్లాలి". |
© 2017,www.logili.com All Rights Reserved.