యదార్థ సంఘటనల ఆధారంగా కల్పించబడిన ఈ నవలలో నేను చెప్పింది యశోధర బుద్ధత్వాన్ని పొందిందనీ, ఆ బుద్ధత్వాన్ని పొందే క్రమం సిద్ధార్థుని మహాభినిష్క్రమణం రోజుకే మొదలయిందని! సిద్ధార్థుడు సర్వం ఒదిలి జ్ఞానాన్వేషణ నిమిత్తమై వెళితే యశోధర సమస్త బంధాల నడుమ, ఐశ్వర్యాల నడుమ ఉండి బుద్ధత్వాన్ని పొందిందని నా అభిప్రాయం. అందువల్లే 'యశోబుద్ధ' అని పేరు పెట్టాను. గౌతమ బుద్ధునితో పాటే యశోధర బుద్ధత్వాన్ని పొందింది. యశోబుద్దగా మారింది.
యశోధర రాహులిడిని బౌద్ధం స్వీకరించటానికి పంపింది. తర్వాత గౌతమి కూడా వెళ్ళింది. ఆ వెళ్ళటానికి కూడా యశోధర ప్రోద్బలం కారణమని నా అభిప్రాయం. ఎంతోమంది స్త్రీలు తమను తాము ప్రత్యక్ష కార్యాచరణరంగం నుంచి ఉపసంహరించుకుని, మరుగున ఉండి చరిత్రను నడిపించారు. వారి చరిత్రల గురించిన ఊహలైనా మొదలైతే, ఆ తర్వాత చారిత్రక పరిశోధన, స్త్రీల చరిత్ర నిర్మాణం జరుగుతాయి. ఈ నవల రాయటం, ఆ ఆశతోనే.
- ఓల్గా
యదార్థ సంఘటనల ఆధారంగా కల్పించబడిన ఈ నవలలో నేను చెప్పింది యశోధర బుద్ధత్వాన్ని పొందిందనీ, ఆ బుద్ధత్వాన్ని పొందే క్రమం సిద్ధార్థుని మహాభినిష్క్రమణం రోజుకే మొదలయిందని! సిద్ధార్థుడు సర్వం ఒదిలి జ్ఞానాన్వేషణ నిమిత్తమై వెళితే యశోధర సమస్త బంధాల నడుమ, ఐశ్వర్యాల నడుమ ఉండి బుద్ధత్వాన్ని పొందిందని నా అభిప్రాయం. అందువల్లే 'యశోబుద్ధ' అని పేరు పెట్టాను. గౌతమ బుద్ధునితో పాటే యశోధర బుద్ధత్వాన్ని పొందింది. యశోబుద్దగా మారింది. యశోధర రాహులిడిని బౌద్ధం స్వీకరించటానికి పంపింది. తర్వాత గౌతమి కూడా వెళ్ళింది. ఆ వెళ్ళటానికి కూడా యశోధర ప్రోద్బలం కారణమని నా అభిప్రాయం. ఎంతోమంది స్త్రీలు తమను తాము ప్రత్యక్ష కార్యాచరణరంగం నుంచి ఉపసంహరించుకుని, మరుగున ఉండి చరిత్రను నడిపించారు. వారి చరిత్రల గురించిన ఊహలైనా మొదలైతే, ఆ తర్వాత చారిత్రక పరిశోధన, స్త్రీల చరిత్ర నిర్మాణం జరుగుతాయి. ఈ నవల రాయటం, ఆ ఆశతోనే. - ఓల్గా© 2017,www.logili.com All Rights Reserved.