భగవద్గీత ఓషో ప్రవచనాలు కృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన అసాధారణ సంభాషణకు నూతన దృష్టికోణాన్ని ఇస్తాయి. కృష్ణుడి బహుముఖ వ్యక్తిత్వంలోని ఒక తెలియని కోణాన్ని అవి బహిర్గతం చేస్తాయి. బహుశా ఓషో కన్నా ముందుగా కృష్ణుడి అంతర్ దృష్టిని ఇంత లోతుగా ఎవరూ అవగాహన చేసుకోలేదు. కృష్ణుడిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. కృష్ణుడు పూర్ణావతారం, అయినప్పటికీ మనోవైజ్ఞానికవేత్తగా ఆయనకు ఉన్న ప్రతిభపై ఇంతవరకూ ఎవరూ దృష్టి సారించలేదు. ఓషో జ్ఞానోదయాన్ని సిద్ధించుకున్న ఇరవయ్యవ శతాబ్దపు సద్గురువు. వేలాది సంవత్సరాల క్రితం అర్జునుడు అన్వేషించినట్లుగానే, ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న సమకాలీన మానవుడు ఇంకా సులభంగా అవగాహన చేసుకోగలిగేలా... ఓషో సనాతన ప్రజ్ఞను ఆధునిక భాషలోకి అనువదించారు.
"కృష్ణుడిని 'మనోవైజ్ఞానికశాస్త్రపిత' గా పిలవాలి అని నేను భావిస్తాను. ద్వంద్వంలో పడిపోయి సందిగ్ధస్థితిలో, సంతాపంలో మునిగిపోయిన మనస్సునూ, ఖండఖండాలుగా విడిపోయిన సంకల్పాన్నీ ఐక్యంగా, అఖండంగా చేసే ప్రయత్నం చేసిన ప్రప్రధమ వ్యక్తి కృష్ణుడు. మనోవిశ్లేషణను వినియోగించిన మొదటి మానవుడు ఆయనే."
భగవద్గీత ఓషో ప్రవచనాలు కృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన అసాధారణ సంభాషణకు నూతన దృష్టికోణాన్ని ఇస్తాయి. కృష్ణుడి బహుముఖ వ్యక్తిత్వంలోని ఒక తెలియని కోణాన్ని అవి బహిర్గతం చేస్తాయి. బహుశా ఓషో కన్నా ముందుగా కృష్ణుడి అంతర్ దృష్టిని ఇంత లోతుగా ఎవరూ అవగాహన చేసుకోలేదు. కృష్ణుడిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. కృష్ణుడు పూర్ణావతారం, అయినప్పటికీ మనోవైజ్ఞానికవేత్తగా ఆయనకు ఉన్న ప్రతిభపై ఇంతవరకూ ఎవరూ దృష్టి సారించలేదు. ఓషో జ్ఞానోదయాన్ని సిద్ధించుకున్న ఇరవయ్యవ శతాబ్దపు సద్గురువు. వేలాది సంవత్సరాల క్రితం అర్జునుడు అన్వేషించినట్లుగానే, ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న సమకాలీన మానవుడు ఇంకా సులభంగా అవగాహన చేసుకోగలిగేలా... ఓషో సనాతన ప్రజ్ఞను ఆధునిక భాషలోకి అనువదించారు. "కృష్ణుడిని 'మనోవైజ్ఞానికశాస్త్రపిత' గా పిలవాలి అని నేను భావిస్తాను. ద్వంద్వంలో పడిపోయి సందిగ్ధస్థితిలో, సంతాపంలో మునిగిపోయిన మనస్సునూ, ఖండఖండాలుగా విడిపోయిన సంకల్పాన్నీ ఐక్యంగా, అఖండంగా చేసే ప్రయత్నం చేసిన ప్రప్రధమ వ్యక్తి కృష్ణుడు. మనోవిశ్లేషణను వినియోగించిన మొదటి మానవుడు ఆయనే."© 2017,www.logili.com All Rights Reserved.