మానవుడే దేవుడు అని చెప్పడానికి, దైవాంశం మనలోనే ఉన్నాడని చెప్పడానికి కృష్ణావతారాన్ని యుద్ధ తంత్రంలో ఆరితేరిన నిపుణుడిగానే కాకుండా, ఆయన నోటి వెంబడి గీత ద్వారా దివ్యమైన వాక్యాలను ఈ సమాజానికి అందించారు వ్యాసులు వారు. దిక్కు తోచని చీకటిలో ఉన్న ఈ మానవుడికి మార్గాన్ని చూపించి వెళ్ళారు ఎంతోమంది ఆదర్శ పురుషులు. ఇందులో కొందరు శ్రేష్టులు అయితే, మరికొందరు ఉత్తమోత్తములు. అయితే వారందరూ ఈ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదాంత సనాతన ధర్మాలకు అద్దం పట్టడానికి కారకులయ్యారు.
ఈ పై విషయాలను గూర్చి నా కంటే ఎంతో చక్కగా, పరిమళ భరితంగా వుండే పువ్వులను, ఆ పువ్వుల్ని గుచ్చిన మహానుభావులు ఎంతో మంది వ్రాసిన గ్రంథాలను, భాష్యాలను చదివాక, ఈ విషయాలన్నీ సామాన్య ప్రజానీకానికి అందడం లేదని, కాబట్టి వారికి ఏ కొంచమైనా అందించడానికి ముందు నన్ను గూర్చి నేను తెలుసుకొని, తోటి మానవుల భుజం తట్టి మానవులలో ఆత్మ ఉన్నదని, అదే బ్రహ్మం, అదే సర్వస్వం, ఆ చైతన్యాన్ని శరీరంలో ఉన్నంత సేపూ మనం మనుషులుగా ఉండగలుగుతాము అని తెలియజేయడమే ఈ గ్రంథం ద్వారా నా ప్రయత్నం.
మానవుడే దేవుడు అని చెప్పడానికి, దైవాంశం మనలోనే ఉన్నాడని చెప్పడానికి కృష్ణావతారాన్ని యుద్ధ తంత్రంలో ఆరితేరిన నిపుణుడిగానే కాకుండా, ఆయన నోటి వెంబడి గీత ద్వారా దివ్యమైన వాక్యాలను ఈ సమాజానికి అందించారు వ్యాసులు వారు. దిక్కు తోచని చీకటిలో ఉన్న ఈ మానవుడికి మార్గాన్ని చూపించి వెళ్ళారు ఎంతోమంది ఆదర్శ పురుషులు. ఇందులో కొందరు శ్రేష్టులు అయితే, మరికొందరు ఉత్తమోత్తములు. అయితే వారందరూ ఈ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదాంత సనాతన ధర్మాలకు అద్దం పట్టడానికి కారకులయ్యారు. ఈ పై విషయాలను గూర్చి నా కంటే ఎంతో చక్కగా, పరిమళ భరితంగా వుండే పువ్వులను, ఆ పువ్వుల్ని గుచ్చిన మహానుభావులు ఎంతో మంది వ్రాసిన గ్రంథాలను, భాష్యాలను చదివాక, ఈ విషయాలన్నీ సామాన్య ప్రజానీకానికి అందడం లేదని, కాబట్టి వారికి ఏ కొంచమైనా అందించడానికి ముందు నన్ను గూర్చి నేను తెలుసుకొని, తోటి మానవుల భుజం తట్టి మానవులలో ఆత్మ ఉన్నదని, అదే బ్రహ్మం, అదే సర్వస్వం, ఆ చైతన్యాన్ని శరీరంలో ఉన్నంత సేపూ మనం మనుషులుగా ఉండగలుగుతాము అని తెలియజేయడమే ఈ గ్రంథం ద్వారా నా ప్రయత్నం.© 2017,www.logili.com All Rights Reserved.