"కౌసల్య సుప్రజా రామా" అని రుషివాక్కు చిన్నతనం నుంచి ప్రవృత్తి భక్తీ, సంస్కారం కాగా, వృత్తి పదిమంది కన్నీరు తుడిచే దేవాలయం - విజయా హాస్పిటల్ లో ప్రధాన అర్చకులు. కనుక ఆయన కలం నుంచి "వ్యక్తిత్వ వికాసం" సంబంధించిన పుస్తకం తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. సంస్కారం రాంబాబు గర్భగుడి. నాగిరెడ్డిగారన్నా, వారి మానవీయ కోణమన్నా, రూపుదిద్దిన అపూర్వమైన వైద్య సముదాయమన్నా రాంబాబుకి ప్రాణం. ఆ పనిలో ఆయన ఎందరో పెద్దల పరిచయం, ప్రశంసలూ అందుకున్నాడు. కాని రాంబాబు ఒంగిన చెట్టు. తన నీడని పరుస్తాడు. నిటారుగా ఎదిగి పెంచిన నేలని మరచిపోవడం తెలీదు. ఆ కృషి ఫలితమే ఈ "ఆత్మ పరిశీలన". ఈ పుస్తకంలో ఉన్న 33 సుభాషితాలలో ఏ ఒక్కటి చదువుకున్నా ఆ రోజు సుసంపన్నం అవుతుంది.
మంచి ఆలోచనకి పరిణతి అక్కరలేదు, మంచి సంస్కారం చాలు. పెద్ద చదువు అక్కరలేదు, సద్భుద్ది చాలు. ఇంత చిన్న పెట్టుబడితో కొండంత ఉపకారాన్ని చేసే చక్కని ఆలోచనల సముదాయం ఈ "ఆత్మ పరిశీలన". అలతి మాటలతో, అతి సరళమయిన ఆలోచనల బాలశిక్ష ఈ పుస్తకం. చదువుకుంటే జీవితమంతా ఉపకారం చేస్తుంది.
"కౌసల్య సుప్రజా రామా" అని రుషివాక్కు చిన్నతనం నుంచి ప్రవృత్తి భక్తీ, సంస్కారం కాగా, వృత్తి పదిమంది కన్నీరు తుడిచే దేవాలయం - విజయా హాస్పిటల్ లో ప్రధాన అర్చకులు. కనుక ఆయన కలం నుంచి "వ్యక్తిత్వ వికాసం" సంబంధించిన పుస్తకం తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. సంస్కారం రాంబాబు గర్భగుడి. నాగిరెడ్డిగారన్నా, వారి మానవీయ కోణమన్నా, రూపుదిద్దిన అపూర్వమైన వైద్య సముదాయమన్నా రాంబాబుకి ప్రాణం. ఆ పనిలో ఆయన ఎందరో పెద్దల పరిచయం, ప్రశంసలూ అందుకున్నాడు. కాని రాంబాబు ఒంగిన చెట్టు. తన నీడని పరుస్తాడు. నిటారుగా ఎదిగి పెంచిన నేలని మరచిపోవడం తెలీదు. ఆ కృషి ఫలితమే ఈ "ఆత్మ పరిశీలన". ఈ పుస్తకంలో ఉన్న 33 సుభాషితాలలో ఏ ఒక్కటి చదువుకున్నా ఆ రోజు సుసంపన్నం అవుతుంది. మంచి ఆలోచనకి పరిణతి అక్కరలేదు, మంచి సంస్కారం చాలు. పెద్ద చదువు అక్కరలేదు, సద్భుద్ది చాలు. ఇంత చిన్న పెట్టుబడితో కొండంత ఉపకారాన్ని చేసే చక్కని ఆలోచనల సముదాయం ఈ "ఆత్మ పరిశీలన". అలతి మాటలతో, అతి సరళమయిన ఆలోచనల బాలశిక్ష ఈ పుస్తకం. చదువుకుంటే జీవితమంతా ఉపకారం చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.