ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు.
హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది. తనమీద దాడి చేసిన మతాలపై తనదైన ప్రత్యేక ముద్రను వేసి వాటినీ ఆదరించింది హిందూధర్మం. హిందూమతంలో ఎక్కువ తక్కువలకు చోటు లేదు. మధ్యలో వచ్చిన కుహనావాదులవల్ల ఏవైనా ఎక్కువ తక్కువలు ఏర్పడ్డా కాలక్రమంలో వచ్చిన మార్పులతో అవీ కొట్టుకుపోయాయి. ఎందరో మహానుభావులు హిందూధర్మ ఉన్నతిని చాటేందుకు కృషిచేస్తున్నారు.
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది. తనమీద దాడి చేసిన మతాలపై తనదైన ప్రత్యేక ముద్రను వేసి వాటినీ ఆదరించింది హిందూధర్మం. హిందూమతంలో ఎక్కువ తక్కువలకు చోటు లేదు. మధ్యలో వచ్చిన కుహనావాదులవల్ల ఏవైనా ఎక్కువ తక్కువలు ఏర్పడ్డా కాలక్రమంలో వచ్చిన మార్పులతో అవీ కొట్టుకుపోయాయి. ఎందరో మహానుభావులు హిందూధర్మ ఉన్నతిని చాటేందుకు కృషిచేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.