తొలిపలుకులు
మాల ధరించిన అయ్యప్పలు, అయ్యప్ప భక్తులకు
స్వామి శరణం, అయ్యప్ప శరణం.
గత 30 సం||లుగా రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వామివారి
భజన సంకీర్తన సేవలో పాల్గొంటున్న ఆర్కెస్ట్రా.
డప్పు శ్రీను అయ్యప్ప భజన బృందం,
నరసరావుపేట, గుంటూరు జిల్లా
గత 17 సంవత్సరాలుగా మేము రిలీజ్ చేసిన అయ్యప్ప స్వామి వారి 16 ఆడియో క్యాసెట్లు, దుర్గా అమ్మవారి క్యాసెట్టు మరియు 2010వ సంవతరంలో రిలీజ్ చేసిన “అయ్యప్ప భజన దర్శని” (వీడియో)ని విశేషంగా ఆదరించి మమ్ములను ప్రోత్సహిస్తున్న అయ్యప్ప స్వాములు, భకులు, గురుస్వాములు అందరికీ మా డప్పు శ్రీను అయ్యప్ప భజన బృందం ఆర్కెస్ట్రా సభ్యులందరి తరపున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2019 సం||లో సవినయంగా భక్తిపూర్వకంగా స్వామివారి నామసంకీర్తనని మరింత విస్త్రుతం చేయాలనే సత్ సంకల్పంతో సమర్పిస్తున్న 17వ కానుక “డప్పుశ్రీను అయ్యప్ప భజనలు వాల్యూం -17". మరియు శ్రీశైలం మల్లిఖార్జున స్వామి భజనలు, నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి భజనలు, నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి భజనలు, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి భజనలను కూడా భక్తులకు అందించడం జరిగినది. మా ఈ ప్రయత్నాన్ని కూడా సహృదయంతో ఆదరిస్తారని మనవి చేస్తూ సదా అయ్యప్ప స్వామివారి సేవలో మీ..
చౌడం శ్రీనివాసరావు (వాసు) గురుస్వామి
భజనల రచయిత & వ్యాఖ్యాత,
డప్పుశ్రీను గురుస్వామి
సుంకర ఆంజనేయలు గానం
సంగీత దర్శకులు
మరియు ఆర్కెస్ట్రా బృందం సభ్యులు
© 2017,www.logili.com All Rights Reserved.