హరిహరనందుడైన అమృతరూపుడు శ్రీ అయ్యప్ప స్వామి దర్శనార్ధం దేశం నలుమూలల నుంచీ కులమతభాషా విచక్షణ లేకుండా సాలీనా కోట్లాది భక్తులు ముద్రమాలలు ధరించి, మండలదీక్షలు వహించి కఠోర నియమనిష్ఠలను భరించి, నల్లదుస్తులు ధరించి ఆ చల్లని స్వామికి శరణు ఘోషలు చెప్పుకుంటూ శబరిమలకు యాత్ర సాగిస్తూనే ఉన్నారు. ఏటేటా వేలాది కొత్త భక్తుల కన్నెస్వాములతో సన్నిధానం సర్వాంగ సుందరంగా వెలుగుతోంది. ప్రతినిత్యం ప్రాతస్సంధ్యా స్నానాల అనంతరం కాస్తంత కర్పూరాన్ని వెలిగించి - "స్వామియే శరణమయ్యప్ప" అంటూ చెప్పుకునే శరణుఘోషల అనంతరం - భక్తీప్రపత్తులతో ఆ అయ్యప్పను స్మరించు కునేందుకు ఒక నిర్దుష్టమైన గ్రంధమంటూ ఏది ఉన్నట్లుగా మా దృష్టికి రాలేదు.
ఇలాంటి సందర్భంలో - అటు భక్తీ ప్రవత్తులతో మాలా ధారణం చేసి - ఇటు నిత్య జీవితం సంభరణం కోసం తాపత్రయపడే భక్తులకు, శ్రీస్వామి అయ్యప్ప యొక్క చరిత్రను నిత్యపారాయణ గ్రంధంగా తీర్చిదిద్దాలని - చిరకాలంగా భావిస్తున్న మా ఆశయం ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన ఇన్నాళ్ళకు ఈ రూపాన నెరవేరింది.
హరిహరనందుడైన అమృతరూపుడు శ్రీ అయ్యప్ప స్వామి దర్శనార్ధం దేశం నలుమూలల నుంచీ కులమతభాషా విచక్షణ లేకుండా సాలీనా కోట్లాది భక్తులు ముద్రమాలలు ధరించి, మండలదీక్షలు వహించి కఠోర నియమనిష్ఠలను భరించి, నల్లదుస్తులు ధరించి ఆ చల్లని స్వామికి శరణు ఘోషలు చెప్పుకుంటూ శబరిమలకు యాత్ర సాగిస్తూనే ఉన్నారు. ఏటేటా వేలాది కొత్త భక్తుల కన్నెస్వాములతో సన్నిధానం సర్వాంగ సుందరంగా వెలుగుతోంది. ప్రతినిత్యం ప్రాతస్సంధ్యా స్నానాల అనంతరం కాస్తంత కర్పూరాన్ని వెలిగించి - "స్వామియే శరణమయ్యప్ప" అంటూ చెప్పుకునే శరణుఘోషల అనంతరం - భక్తీప్రపత్తులతో ఆ అయ్యప్పను స్మరించు కునేందుకు ఒక నిర్దుష్టమైన గ్రంధమంటూ ఏది ఉన్నట్లుగా మా దృష్టికి రాలేదు. ఇలాంటి సందర్భంలో - అటు భక్తీ ప్రవత్తులతో మాలా ధారణం చేసి - ఇటు నిత్య జీవితం సంభరణం కోసం తాపత్రయపడే భక్తులకు, శ్రీస్వామి అయ్యప్ప యొక్క చరిత్రను నిత్యపారాయణ గ్రంధంగా తీర్చిదిద్దాలని - చిరకాలంగా భావిస్తున్న మా ఆశయం ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన ఇన్నాళ్ళకు ఈ రూపాన నెరవేరింది.© 2017,www.logili.com All Rights Reserved.