బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మవిధుడు అయిన గురువు లేకుండా ఆధ్యాత్మిక వికాసం రాదు. జ్ఞానాన్వేషణలో గడిపే భక్తుణ్ణి, సాధకున్ని భగవంతుని సాన్నిధ్యానికి ఉద్దరించే వాడే నిజమైన గురువు. వేదాలు, శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించిన గురువులు ఎందఱో ఉన్నారు. విశ్వకాలాతీతమైన మహా సత్య సాక్షాత్కారాన్ని పొందిన గురువు బహు అరుదుగా లభిస్తాడు.
అంతు లేకుండా ఉన్న వేదాలను వ్యాసమహర్షి క్రోడీకరించాడు. ప్రపంచంలోనే అతి బృహత్తరమైన మహాభారతాన్ని అందించిన కవి ద్రష్టవ్యాసుడు. అందులో కళాత్మక, కవితాత్మక విలువలే కాదు తరతరాలుగా మానవాళిని ఉత్తేజం చేసే ధర్మాలు, సత్యాలు, నీతులు ఎన్నెన్నో మణిమయ నిక్షేపాలుగా పొదిగి ఉన్నాయి. వేద విజ్ఞానమంతా వ్యాసునిగా మూర్తీభవించింది. అటువంటి వేద విజ్ఞానము అందించే గురువును జ్ఞాని అయిన భక్తులు ఎన్నుకోవాలి.
ఈ జ్ఞానప్రసాదాన్ని ఏ దేశవాసులైనా స్వీకరించవచ్చు. ఆరోగ్య, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, రాజకీయ, న్యాయ రంగాలలో అదీ, ఇదీ అవి లేకుండా మానవజీవితంలో అన్ని దశలలో, అన్ని స్థితులలో మనకు మార్గదర్శకత్వం వహించడానికి నిలిచి వున్న మన సనాతన జ్ఞానాన్ని అపురూపముగా అంది పుచ్చుకొని జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం!
బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మవిధుడు అయిన గురువు లేకుండా ఆధ్యాత్మిక వికాసం రాదు. జ్ఞానాన్వేషణలో గడిపే భక్తుణ్ణి, సాధకున్ని భగవంతుని సాన్నిధ్యానికి ఉద్దరించే వాడే నిజమైన గురువు. వేదాలు, శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించిన గురువులు ఎందఱో ఉన్నారు. విశ్వకాలాతీతమైన మహా సత్య సాక్షాత్కారాన్ని పొందిన గురువు బహు అరుదుగా లభిస్తాడు. అంతు లేకుండా ఉన్న వేదాలను వ్యాసమహర్షి క్రోడీకరించాడు. ప్రపంచంలోనే అతి బృహత్తరమైన మహాభారతాన్ని అందించిన కవి ద్రష్టవ్యాసుడు. అందులో కళాత్మక, కవితాత్మక విలువలే కాదు తరతరాలుగా మానవాళిని ఉత్తేజం చేసే ధర్మాలు, సత్యాలు, నీతులు ఎన్నెన్నో మణిమయ నిక్షేపాలుగా పొదిగి ఉన్నాయి. వేద విజ్ఞానమంతా వ్యాసునిగా మూర్తీభవించింది. అటువంటి వేద విజ్ఞానము అందించే గురువును జ్ఞాని అయిన భక్తులు ఎన్నుకోవాలి. ఈ జ్ఞానప్రసాదాన్ని ఏ దేశవాసులైనా స్వీకరించవచ్చు. ఆరోగ్య, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, రాజకీయ, న్యాయ రంగాలలో అదీ, ఇదీ అవి లేకుండా మానవజీవితంలో అన్ని దశలలో, అన్ని స్థితులలో మనకు మార్గదర్శకత్వం వహించడానికి నిలిచి వున్న మన సనాతన జ్ఞానాన్ని అపురూపముగా అంది పుచ్చుకొని జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం!© 2017,www.logili.com All Rights Reserved.