ప్రాచీన కాలం నుండి అత్యంత పవిత్రమైన నదిగా ప్రసిద్ధిచెందిన గోదావరి నదిని గురించిన ప్రస్తావన బ్రహ్మాండ, బ్రహ్మ, వరాహ పురాణాలలోనూ, మహాభారతం, రామాయణాలతోపాటు శాతవాహన చక్రవర్తి రచించిన 'గాధా సప్తసతి', మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం, మేఘసందేశాల్లోనూ, భవభూతి రచించిన కావ్యమీమాంస, కల్హణుడు రచించిన రాజతరంగిణిలోనూ, కంబరామాయణంలోనూ, నన్నయ, పోతన, శ్రీనాధుడి రచనలలోనూ ఉంది.
అటువంటి గోదావరి నది జన్మించినప్పటి నుంచి సముద్రంలో సంగమించేంత వరకు గోదావరీ తీరం వెంబడి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ భక్తులపై పుణ్యపు రాశులను వర్షింపచేస్తూ ఉన్నాయి. గోదావరి నదిలో స్నానమాచరించి, నదితీరంలో ఉన్న ఆలయాలను, అందులో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించడం అత్యంత పవిత్రకార్యం! పుణ్యకార్యం!! ఆయా క్షేత్రాలను దర్శించడమే కాదు వాటిని గురించి తెలుసుకొనడం... వాటిని స్మరించడం కూడా అత్యంత పవిత్ర కార్యం! ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి!!
ప్రాచీన కాలం నుండి అత్యంత పవిత్రమైన నదిగా ప్రసిద్ధిచెందిన గోదావరి నదిని గురించిన ప్రస్తావన బ్రహ్మాండ, బ్రహ్మ, వరాహ పురాణాలలోనూ, మహాభారతం, రామాయణాలతోపాటు శాతవాహన చక్రవర్తి రచించిన 'గాధా సప్తసతి', మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం, మేఘసందేశాల్లోనూ, భవభూతి రచించిన కావ్యమీమాంస, కల్హణుడు రచించిన రాజతరంగిణిలోనూ, కంబరామాయణంలోనూ, నన్నయ, పోతన, శ్రీనాధుడి రచనలలోనూ ఉంది. అటువంటి గోదావరి నది జన్మించినప్పటి నుంచి సముద్రంలో సంగమించేంత వరకు గోదావరీ తీరం వెంబడి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ భక్తులపై పుణ్యపు రాశులను వర్షింపచేస్తూ ఉన్నాయి. గోదావరి నదిలో స్నానమాచరించి, నదితీరంలో ఉన్న ఆలయాలను, అందులో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించడం అత్యంత పవిత్రకార్యం! పుణ్యకార్యం!! ఆయా క్షేత్రాలను దర్శించడమే కాదు వాటిని గురించి తెలుసుకొనడం... వాటిని స్మరించడం కూడా అత్యంత పవిత్ర కార్యం! ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి!!© 2017,www.logili.com All Rights Reserved.