షోడశ సంస్కారాలు
వేదాలు, స్మృతులు, పురాణాలలో చెప్పబడిన కొన్ని కర్మలను,
విశేషం లేదా పవిత్రత కలిగించడాన్ని సంస్కారం అని చెప్పవచ్చు. అంటే దోషాలను పోగొట్టి గొప్ప గుణములను కలిగించడమే సంస్కారం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునేలాగా చేయడమే సంస్కారం. ఇంకోరకంగా చెప్పాలంటే సంస్కారం అంటే మంచి చేయడం.
సంస్కారాలు వల్ల మనిషి సంస్కరించబడి దయ, ఓర్పు వంటి ఆత్మ సంబంధమైన గొప్ప గుణాలు కలుగుతాయని... చివరకు బ్రహ్మపదం పొందగలరని గౌతమాది మహర్షులు పేర్కొన్నారు. వివిధ రంగులతో ఒక ఆకారం ఎలా ఏర్పడుతుందో సంస్కారాల వల్ల అలా ఉత్తమ స్థితి కలుగుతుందని అంగిరస మహర్షి పేర్కొన్నారు.
ఋగ్వేదం మొదలుకొని నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ధర్మశాస్త్ర గ్రంథాలలో సంస్కారాలను గురించిన వివరాలు, వివరణలు కనిపిస్తాయి.
విల్ డ్యూరాంట్ అనే చరిత్రకారుడు "హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్" అనే
"ప్రతి మతంలో సంస్కారాలు తప్పనిసరి. తాము నమ్మిన పరమేశ్వరుని వల్ల ఉపదేశజనకమై వచ్చినవే సంస్కారాలు. అట్టి సంస్కారాలను పాటించడం వల్ల అవి విశ్వాస పోషకమవుతాయి. చివరి వరకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కారకం అవుతున్నాయి. తాను నమ్మిన పరమేశ్వరునితో సుఖంతో కూడిన సంబంధమును కలుగజేస్తాయి. లలిత కళలతో హృదయాన్ని ఇంద్రియాలను ప్రదీప్తం చేస్తాయి. ఒకే విధమైన కర్మకాండతో... మంత్ర తంత్ర క్రియాకలాపంతో... తుదకు సమాన భావపరంపరతో... సంస్కారాలు ప్రతి వ్యక్తిని ఒక మధురబంధంతో ముడివేసి ఉన్నవి" అని పేర్కొన్నారు...............................
షోడశ సంస్కారాలు వేదాలు, స్మృతులు, పురాణాలలో చెప్పబడిన కొన్ని కర్మలను, విశేషం లేదా పవిత్రత కలిగించడాన్ని సంస్కారం అని చెప్పవచ్చు. అంటే దోషాలను పోగొట్టి గొప్ప గుణములను కలిగించడమే సంస్కారం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునేలాగా చేయడమే సంస్కారం. ఇంకోరకంగా చెప్పాలంటే సంస్కారం అంటే మంచి చేయడం. సంస్కారాలు వల్ల మనిషి సంస్కరించబడి దయ, ఓర్పు వంటి ఆత్మ సంబంధమైన గొప్ప గుణాలు కలుగుతాయని... చివరకు బ్రహ్మపదం పొందగలరని గౌతమాది మహర్షులు పేర్కొన్నారు. వివిధ రంగులతో ఒక ఆకారం ఎలా ఏర్పడుతుందో సంస్కారాల వల్ల అలా ఉత్తమ స్థితి కలుగుతుందని అంగిరస మహర్షి పేర్కొన్నారు. ఋగ్వేదం మొదలుకొని నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ధర్మశాస్త్ర గ్రంథాలలో సంస్కారాలను గురించిన వివరాలు, వివరణలు కనిపిస్తాయి. విల్ డ్యూరాంట్ అనే చరిత్రకారుడు "హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్" అనే "ప్రతి మతంలో సంస్కారాలు తప్పనిసరి. తాము నమ్మిన పరమేశ్వరుని వల్ల ఉపదేశజనకమై వచ్చినవే సంస్కారాలు. అట్టి సంస్కారాలను పాటించడం వల్ల అవి విశ్వాస పోషకమవుతాయి. చివరి వరకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కారకం అవుతున్నాయి. తాను నమ్మిన పరమేశ్వరునితో సుఖంతో కూడిన సంబంధమును కలుగజేస్తాయి. లలిత కళలతో హృదయాన్ని ఇంద్రియాలను ప్రదీప్తం చేస్తాయి. ఒకే విధమైన కర్మకాండతో... మంత్ర తంత్ర క్రియాకలాపంతో... తుదకు సమాన భావపరంపరతో... సంస్కారాలు ప్రతి వ్యక్తిని ఒక మధురబంధంతో ముడివేసి ఉన్నవి" అని పేర్కొన్నారు...............................© 2017,www.logili.com All Rights Reserved.