శ్రీ ఐ. ఎల్.ఎస్.చంద్రశేఖర్ రావు స్వస్థలం కడప జిల్లా పోరుమామిళ్ల. చరిత్ర, తెలుగులో ఎం.ఏ. చేసిన వీరు ప్రస్తుతం వృత్తిరీత్యా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉన్నారు. వీరు వివిధ దిన, వార, మాస పత్రికలలో నాలుగు వేలకు పైగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాశారు. వీరు రాసిన షిర్డీ క్షేత్రవైభవం , శ్రీశైల వైభవం, అయ్యప్ప చరిత్ర, తిరుమల తిరుపతి దర్సననం, అష్టాదశ శక్తిపీఠాలు, మన మాసాలు, బృందావనం, పెంచలకోన, తెలుగునాట శ్రీరామక్షేత్రాలు, శ్రీరామదూతం, అహోబిలక్షేత్ర వైభవం వంటి ఇరవైమూడు పుస్తకాలు ప్రచురించబాడ్డాయి. తెలుగు అకాడమీ వారి డిగ్రీ,ఇంటర్మీడియట్ చరిత్ర పాఠ్యపుస్తకాలు రచించారు. విద్యావిషయక గ్రంథాలకు సంపాదకులుగా పనిచేశారు., ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విషయక టివి ఛానల్లో డిగ్రీ విద్యార్థులకు పట్యంశాలను ప్రత్యక్షంగా భోదించడంతో పాటు ఆకాశవాణి, టివి ఛానల్స్ లో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేశారు.