పూజ, ధ్యానం, యోగం, సాధన, యాత్ర వీటిని భిన్నమైన విషయములుగా భావిస్తాము. మనస్థాయి ననుసరించి వీనిలో ఏదో మార్గం ద్వారా భగవత్ తత్త్వాన్ని దర్శించాలని ఆశిస్తాం. 'సచ్చిదానంద అంతర్యాత్ర.. ద్వారా సద్గురువులు సూచించిన విషయాలు వీటి సమన్వయముగా భావించవచ్చు. ఇది పఠించి అర్ధం చేసుకునే గ్రంథం కాదు. దర్శించి అనుభూతి చెందేది.
అంతర్యాత్రలో వచ్చే కొన్ని సందేహాలను స్వామీజీ ముందు ఉంచాలనే కోరికతో ఆ వివరములను పరిష్కారాన్ని, ఆశిస్తూ, ఉత్తరం ద్వారా సద్గురువులు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి విన్నవించాను. పదిరోజుల తరువాత నాకు పరీక్షలు మొదలయ్యాయి. స్వామీజీ నా సందేహములపై దృష్టి పెట్టారని అర్ధమయింది. దత్తుడికి తన భక్తులను పరీక్షించడం ఓ వినోదం. వారిని అనుగ్రహించడం ఆయన నియమం సాక్షాత్తు దత్తస్వరూపులు కదా మన స్వామీజీ! చూద్దాం ఏమి జరుగుతుందోనని మౌనంగా ఉన్నాను.
పూజ, ధ్యానం, యోగం, సాధన, యాత్ర వీటిని భిన్నమైన విషయములుగా భావిస్తాము. మనస్థాయి ననుసరించి వీనిలో ఏదో మార్గం ద్వారా భగవత్ తత్త్వాన్ని దర్శించాలని ఆశిస్తాం. 'సచ్చిదానంద అంతర్యాత్ర.. ద్వారా సద్గురువులు సూచించిన విషయాలు వీటి సమన్వయముగా భావించవచ్చు. ఇది పఠించి అర్ధం చేసుకునే గ్రంథం కాదు. దర్శించి అనుభూతి చెందేది. అంతర్యాత్రలో వచ్చే కొన్ని సందేహాలను స్వామీజీ ముందు ఉంచాలనే కోరికతో ఆ వివరములను పరిష్కారాన్ని, ఆశిస్తూ, ఉత్తరం ద్వారా సద్గురువులు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి విన్నవించాను. పదిరోజుల తరువాత నాకు పరీక్షలు మొదలయ్యాయి. స్వామీజీ నా సందేహములపై దృష్టి పెట్టారని అర్ధమయింది. దత్తుడికి తన భక్తులను పరీక్షించడం ఓ వినోదం. వారిని అనుగ్రహించడం ఆయన నియమం సాక్షాత్తు దత్తస్వరూపులు కదా మన స్వామీజీ! చూద్దాం ఏమి జరుగుతుందోనని మౌనంగా ఉన్నాను.© 2017,www.logili.com All Rights Reserved.