ఒక పండుగ రావడానికి (ఏర్పడడానికి) ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతున్నారు. ఇందులో ఏది నమ్మాలి! ఏది నిజం! అని కోత్వాలు వెంకట రామారెడ్డిని ప్రశ్నించారు హైదరాబాదు సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మానలీఖాన్. శ్రీ రెడ్డి అప్పటికే గోలకొండ పత్రిక సంపాదకులుగా తెలుగు వారి చైతన్యానికి దోహదం చేస్తున్న శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తో ఈ విషయం ప్రస్తావించారు. కేవలం ప్రస్తావన కాకుండా హిందువుల పండుగల పై ఓ పుస్తకమే వ్రాయుమన్నారు. ఇంకేం! అప్పటి వరకు పండుగల గురించి పలు విధాలుగా చెప్పుకొంటున్న ప్రజానీకం ముందుకు ఓ పుస్తకం వచ్చింది. అదే హిందువుల పండుగలు; అనేక పర్యాయాలు అచ్చయింది.
1931 లో మొదట ప్రచురితమైన ఇందులో పండుగలు, వ్రతాలు, జయంతులు, ఉత్సవాలున్నాయి. ఏభైకిపైగా ఉన్న ఈ వ్యాసాలకు నిర్ణయ సింధువు, ధర్మ సింధువు, పురాణాలు, వ్రత కథలు, ఆచారాలు ప్రమాణాలయ్యాయి. ఈ గ్రంథం తృతీయ ముద్రణలో శ్రీ ప్రతాపరెడ్డి గారు మరికొన్ని విశేషాలను చేర్చారు. ఈ గ్రంథం 2006 లో ఆరవసారి సురవరం వైజయంతి ట్రస్టు వారు ప్రచురించారు.
- డా. పి. భాస్కరయోగి