సాహిత్యమంటే సమకాలీన సమాజ ప్రతిబింబం. మారుతున్న కాలం, అభిరుచులు, పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహం, సాంస్కృతిక వైవిధ్యం, ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు జయలక్ష్మిగారి కథలకి అంతస్సూత్రాలు. మంచి కథ చదివినప్పుడు తన సమస్యలకి సమాధానం దొరికిందని, ఒక సాధనం లభించిందని పాఠకుడు భావించినట్టయితే ఆ కథకుని శ్రమ ఫలించినట్టేనని విమర్శకుల అభిప్రాయం.
డా జయలక్ష్మి గారి కథల్లో ఈ వైనం గోచరిస్తుంది. మానవ సంబంధాలను విశ్లేషించడంలోనూ, స్త్రీల మనస్తత్వాలను తన పాత్రల ద్వారా చిత్రీకరించడంలోనూ ఈ కథకురాలి నైపుణ్యత విశిష్టంగా కానవస్తుంది. ఈ సంపుటిలోని కథలన్నీ నిత్యజీవితం నుంచి మొలకెత్తినవే. విభిన్నమైన ఇతివృత్తాలతో, సహజ, సుందర, సరళ సంభాషణలతో ఆద్యంతం ఆసక్తికరంగా రచయిత్రి కథలని నడిపిన తీరు ప్రశంసనీయం. మానవ జీవితాన్ని వివిధ కోణాలనుంచి దర్శించేందుకు వీలుగా ఉన్న ప్రయోజనాత్మకమైన, ఆసక్తికరమైన, సందేశాత్మక కథల సమాహారం ‘శతమానంభవతి’ కి శతమానంభవతి!!