ఇవి 1993 నుండి 2018 వరకు ఆయా సందర్భాల్లో ఆయా దేవుళ్ల ఎదుట ఆశువుగా చెప్పిన పద్యాలు. కవితా పరిణతి తెలియడం కోసం వీటిని కాలక్రమంలోనే ఇంచుమించుగా అమర్చడం జరిగింది. ఒక దేవుడికి సంబంధించిన పద్యాలన్నీ ఒక చోటే చేర్చితే భక్తులకి భావసాంకర్య బాధ లేకుండా పాడుకోవడానికి బాగుంటుందని ఆ అమరిక కూడా జరిగింది. క్షేత్రాలు, తీర్థాలు సందర్శించినప్పుడు అనుభూతితో చెప్పిన చాటువులు కూడా దేవతల క్రమంలోనూ, కాల క్రమంలోనూ అందించే ప్రయత్నం చేశాము.
వీటిలో ప్రార్థనలు, అభ్యర్థనలు, ఆవేదనలు, విన్నపాలు, విమర్శలు, ఆత్మ విశ్వాస ప్రకటనలు, సవాళ్లు, నిందలు, సొంత గొడవలు - అన్నీ ఉన్నాయి. అన్నీ భగవదర్పితమైన భావాలే కాబట్టి భక్తి సాగర తరంగాలే అని అర్థం చేసుకొంటే అంతా బాగానే ఉంటుంది.
- గరికిపాటి నరసింహారావు