మహాభారతం ఒక కట్టు కథ కాదు. ఇది ఒక ఇతిహాసం. మహాకావ్యం. ధర్మతత్త్వజ్ఞులకు ధర్మశాస్త్రం. నీతిశాస్త్రం. వేదాంతగ్రంథం. సకలవిధ ధర్మాలకూ, ధర్మసూక్ష్మాలకూ ఇది ఒక స్వర్ణపేటిక... భద్రపీఠిక. వ్యాసభగవానుడు ప్రసాదించిన అనర్ఘత్నం. భారతంలో లేనిది ఎక్కడా లేదు. లోకంలో ఉన్నది ఇందులో లేకుండా లేదు. మూలంలోని సంస్కృత భారతాన్ని మదించి అత్యంత రమణీయంగా మూలానికి వన్నె తెచ్చే విధంగా అమృతాన్ని తెలుగువారికి అందించి కవిత్రయంవారు తెలుగుజాతికి మహోపకారం చేశారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య, నీతి అవినీతి మధ్య భూమికోసం, భుక్తికోసం సాగిన మహా సంగ్రామం కురుక్షేత్ర యుద్ధం. మన హృదయాలలోనే మంచి చెడ్డల సంఘర్షణ నిరంతరం సాగుతూనే ఉంది. 'తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి' ఇది తెలుగునాట నానుడి.
పుస్తకాలు మూడు రకాలన్నారు విజ్ఞులు. నమిలి జీర్నించుకోదగినవి; మ్రింగదగినవి; నాలుకతో రుచి చూడదగినవి. ప్రథమ శ్రేణికి చెందినవే మహాభారతాది గ్రంథాలు. ఇక ఈ గ్రంథం మీది. చదవండి! చదివించండి!!
ఇందులో మహాభారతం - 1, మహాభారతం - 2, మహాభారతం - 3, మహాభారతం - 4 నాలుగు పుస్తకాలు కలిగి ఉన్నాయి.
మహాభారతం ఒక కట్టు కథ కాదు. ఇది ఒక ఇతిహాసం. మహాకావ్యం. ధర్మతత్త్వజ్ఞులకు ధర్మశాస్త్రం. నీతిశాస్త్రం. వేదాంతగ్రంథం. సకలవిధ ధర్మాలకూ, ధర్మసూక్ష్మాలకూ ఇది ఒక స్వర్ణపేటిక... భద్రపీఠిక. వ్యాసభగవానుడు ప్రసాదించిన అనర్ఘత్నం. భారతంలో లేనిది ఎక్కడా లేదు. లోకంలో ఉన్నది ఇందులో లేకుండా లేదు. మూలంలోని సంస్కృత భారతాన్ని మదించి అత్యంత రమణీయంగా మూలానికి వన్నె తెచ్చే విధంగా అమృతాన్ని తెలుగువారికి అందించి కవిత్రయంవారు తెలుగుజాతికి మహోపకారం చేశారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య, నీతి అవినీతి మధ్య భూమికోసం, భుక్తికోసం సాగిన మహా సంగ్రామం కురుక్షేత్ర యుద్ధం. మన హృదయాలలోనే మంచి చెడ్డల సంఘర్షణ నిరంతరం సాగుతూనే ఉంది. 'తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి' ఇది తెలుగునాట నానుడి. పుస్తకాలు మూడు రకాలన్నారు విజ్ఞులు. నమిలి జీర్నించుకోదగినవి; మ్రింగదగినవి; నాలుకతో రుచి చూడదగినవి. ప్రథమ శ్రేణికి చెందినవే మహాభారతాది గ్రంథాలు. ఇక ఈ గ్రంథం మీది. చదవండి! చదివించండి!! ఇందులో మహాభారతం - 1, మహాభారతం - 2, మహాభారతం - 3, మహాభారతం - 4 నాలుగు పుస్తకాలు కలిగి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.