మహాభారతం మనిషి కథ. మనిషికోసం చెప్పిన కథ. మనిషి ఎలా ఉండాలో చెప్పిన కథ. మనిషి ఎలా ఉండకూడదో చెప్పే కథ. ప్రతీ మనిషిలోనూ మెరిసిపోయే వెలుగైన పార్శ్వం ఒకటి ఉంటుంది. ఎవరూ చూడని రహస్యమైన సందర్భాలలో తన ఆలోచనల తీరునీ, నలుగురి ఎదుటా బహిరంగంగా తాను ప్రవర్తించిన తీరునీ. ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా గర్వించదాగిన పార్శ్వం అది. దానిని తలచుకుని ఆనందిస్తాం. ఎవరైనా గమనించి ప్రస్తావిస్తే గర్విస్తాం. అలాగే ప్రతీ మనిషిలోనూ చీకటిపార్శ్వం కూడా ఒకటి ఉంటుంది. అది లేనే లేదనుకోవడం ఆత్మవంచనే. ఎవరికీ తెలియకుండా మనస్సులో మెదిలిన విపరీతమైన ఆలోచనలూ, మనస్సుని నియంత్రించుకోలేని స్థితిలోని తన ప్రవర్తనా, దాని పర్యవసానాలూ, గుర్తుచేసుకుంటే బాధ కలుగుతుంది. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే అవమానం అనిపిస్తుంది.
అసలు తలచుకుంటేనే సిగ్గేస్తుంది. ఇలా కూడా నేనుండగలన అని భయమేస్తుంది. మనిషిలోని ఈ రెండు పార్శ్వాలనీ చక్కగా విశ్లేషించి, సందేహాలకు తావు లేకుండా వివరించి, విమర్శించి చెప్తుంది మహాభారతం.
మహాభారతం మనిషి కథ. మనిషికోసం చెప్పిన కథ. మనిషి ఎలా ఉండాలో చెప్పిన కథ. మనిషి ఎలా ఉండకూడదో చెప్పే కథ. ప్రతీ మనిషిలోనూ మెరిసిపోయే వెలుగైన పార్శ్వం ఒకటి ఉంటుంది. ఎవరూ చూడని రహస్యమైన సందర్భాలలో తన ఆలోచనల తీరునీ, నలుగురి ఎదుటా బహిరంగంగా తాను ప్రవర్తించిన తీరునీ. ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా గర్వించదాగిన పార్శ్వం అది. దానిని తలచుకుని ఆనందిస్తాం. ఎవరైనా గమనించి ప్రస్తావిస్తే గర్విస్తాం. అలాగే ప్రతీ మనిషిలోనూ చీకటిపార్శ్వం కూడా ఒకటి ఉంటుంది. అది లేనే లేదనుకోవడం ఆత్మవంచనే. ఎవరికీ తెలియకుండా మనస్సులో మెదిలిన విపరీతమైన ఆలోచనలూ, మనస్సుని నియంత్రించుకోలేని స్థితిలోని తన ప్రవర్తనా, దాని పర్యవసానాలూ, గుర్తుచేసుకుంటే బాధ కలుగుతుంది. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే అవమానం అనిపిస్తుంది. అసలు తలచుకుంటేనే సిగ్గేస్తుంది. ఇలా కూడా నేనుండగలన అని భయమేస్తుంది. మనిషిలోని ఈ రెండు పార్శ్వాలనీ చక్కగా విశ్లేషించి, సందేహాలకు తావు లేకుండా వివరించి, విమర్శించి చెప్తుంది మహాభారతం.© 2017,www.logili.com All Rights Reserved.