మహాశివరాత్రి మన హిందూపండగలలోకల్లా, కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగల పండుగ. అంటే మిగతా పండగల వలే పొట్టనిండా తినడానికి పిండివంటలు, కొత్త బట్టలు, వినోదాలతో నిండినది కాకుండా ఉపవాసం, జాగరణ, జపము వంటి సాధనాంశాల కోసం ఉద్దేశించబడిన పవిత్ర పర్వ దినం! ఐనప్పటికీ ఈనాడు మనలో చాలా మంది ఈ పండుగనాడు ఏం చేయాలో తెలియక రాత్రి ఏ సినిమాకో సెకండ్ షో కు వెళ్ళి జాగరణ అనుకొని చెత్తగా కాలం వృధా చేసుకొని శివరాత్రి పుణ్యంవస్తుందని భ్రమించే వ్యర్థ జీవులుగా తయారౌతున్నారు!
అలా కాకుండా 1) శివతత్త్వం అంటే ఏమిటి? 2) శివోపాసన ఎలా చేయాలి? 3) శివపంచాక్షరీ రహస్యార్థమేమిటి? 4) శివరాత్రి నాడు చేయవలసిన విధులూ,శివుని వర్ణనలోని యోగ శాస్త్ర జ్యోతిష శాస్త్ర మంత్రశాస్త్ర పరమైన అంతరార్థాలు ఏమిటి? అన్న అంశాలు అనేకం నిజమైన సాధకులకోసం రాయబడిన ఈ అతి చిన్న పుస్తకంలో ఇమిడేలాగా వేదాలు పురాణాలసారం ఇవ్వబడింది!
- డా వేదవ్యాస