శాంతి పాఠః
ఓమ్ సహ నా వవతు| సహ నౌ భునక్తు! సహ వీర్యం కరవావహై| తేజస్వి నా
వధీత మస్తు మా విద్విషావహై॥
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః|
అర్థము :- నౌ - గురు శిష్యులమగు మనలను, సహ అవతు - (అధ్యయన మొనర్పబడుచున్న ఈ మంత్రపాఠము) కలిపి రక్షించు గాక, నౌ - మనలనిద్దటిని, సహ భునక్తు - కాపాడుగాక, వీర్యమ్ - (ఈ మంత్రములతో ఫలసిద్ధికై) ప్రయత్నమును, సహ కరవకలిసి కావింతుము, నౌ - మన ఇద్దటి యొక్క అధీతమ్ - అధ్యయనము, తేజస్వి - ఫలసాధనసమర్థము, అస్కాక,మవిద్మనముపరస్పరము ద్వేషింపకుందుము గాక, ఓం శాస్త్రి శ్శాని శ్శాని
వివరణ :- మనము అధ్యయనమొనర్చుచున్న ఈ మంత్రములు గురుశిష్యులమైన మనలను రక్షించుగాక, ఈ మంత్రము ద్వారా సిద్దించు ఫలితమును పొందుటకు మన కలిసి ప్రయత్నింతుముగాక. మన ఈ మంత్రాధ్యయనము ఫలసాధన సమర్థమగుగాక. మనము పరస్పరము అనురాగముతో నుందుముగాక. ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములను త్రివిధ శాస్త్రులు మనకు కలుగుగాక. అధ్యయన ప్రారంభముగ గురుశిష్యులిద్దరు పఠింపవలసిన శాస్త్ర పాఠ మంత్రము ఇది.
అభవు వలకన్ను రామకర్ణామృతంబు
హరుని డాకన్ను కృష్ణ కర్ణామృతంబు
మృడుని కర్ణామృతం బిది నడిమికన్ను
కామజయ మిచ్చుఁగైవల్యసీమఁజేర్చు.
© 2017,www.logili.com All Rights Reserved.