డా. నరసింహము గారికి, ఆనువంశికముగా సంతరించిన వైదిక శాస్త్ర పరిజ్ఞానము, దైవ కృపవలన కలిగిన ఎకసంథాగ్రాహిత్వము, బహు భాషా కోవిదులగుటకు సుగామమైనది. స్వతస్సిద్ధమైన శాస్త్ర జిజ్ఞాసతో వేద వేదాంగములను, తద్భావములైన, భారతీయ సంస్కృతికి ప్రామాణికములైన ఇతర గ్రంథములను చిన్ననాటనే జీర్నించుకొనిరి. అప్పట్లో వేదవేదంగములు అంతగా ఆంధ్ర భాషలో లేనందునను, వున్నవి సంస్కృత మాత్రుకలను పూర్తిగా అనుసరించక పోవుటచే అసంతృప్తి చెంది ఇతర పండితులు చేసిన వివిధభాషానువాదములను పరిశీలించి అనువాదములలోని వైవిధ్యము ప్రశంసించుచూ అనువాదము చేయుట ప్రారంభించిరి. వీరు కీర్తికాముకులు, ధనకాముకులు కానందున మరియు ఇవి తన ఆత్మవికాసమునకే చేయుటవలన తన జీవిత కాలములో ఈ రచనలను ముద్రించుటకు అంగీకరించలేదు. ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు వీటి శైలి సహజముగా ఉన్నదీ అనియు, శిథిలదశలో నుండుటచే తక్షణ ముధ్రణావశ్యకత యున్నదని అభిప్రాయమును వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము. మన ప్రాచీన సంస్కృతియందు ఆసక్తియున్న ఏ కొద్ది మందికైనా ఇవి ఉపయోగపడునని మా ఆశ.
- డా.ఈశ్వర వరాహ నరసింహము
డా. నరసింహము గారికి, ఆనువంశికముగా సంతరించిన వైదిక శాస్త్ర పరిజ్ఞానము, దైవ కృపవలన కలిగిన ఎకసంథాగ్రాహిత్వము, బహు భాషా కోవిదులగుటకు సుగామమైనది. స్వతస్సిద్ధమైన శాస్త్ర జిజ్ఞాసతో వేద వేదాంగములను, తద్భావములైన, భారతీయ సంస్కృతికి ప్రామాణికములైన ఇతర గ్రంథములను చిన్ననాటనే జీర్నించుకొనిరి. అప్పట్లో వేదవేదంగములు అంతగా ఆంధ్ర భాషలో లేనందునను, వున్నవి సంస్కృత మాత్రుకలను పూర్తిగా అనుసరించక పోవుటచే అసంతృప్తి చెంది ఇతర పండితులు చేసిన వివిధభాషానువాదములను పరిశీలించి అనువాదములలోని వైవిధ్యము ప్రశంసించుచూ అనువాదము చేయుట ప్రారంభించిరి. వీరు కీర్తికాముకులు, ధనకాముకులు కానందున మరియు ఇవి తన ఆత్మవికాసమునకే చేయుటవలన తన జీవిత కాలములో ఈ రచనలను ముద్రించుటకు అంగీకరించలేదు. ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు వీటి శైలి సహజముగా ఉన్నదీ అనియు, శిథిలదశలో నుండుటచే తక్షణ ముధ్రణావశ్యకత యున్నదని అభిప్రాయమును వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము. మన ప్రాచీన సంస్కృతియందు ఆసక్తియున్న ఏ కొద్ది మందికైనా ఇవి ఉపయోగపడునని మా ఆశ. - డా.ఈశ్వర వరాహ నరసింహము© 2017,www.logili.com All Rights Reserved.