డా ఈశ్వర వరాహ నరసింహం గారు వ్రుత్తి రీత్యా వైద్యులు. సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ, ఒరియా, ఉర్దూ భాషలలో నిష్టాత్తులు. పర్షియన్ భాషా పరిచయం కూడా ఉంది. వేదంవేదాంగాలలోను, జ్యోతిష శాస్త్రంలోను పాండిత్యం కలిగినవారు. తన 26 వ ఏట ప్రారంభించి 69 ఏట వరకు నిరంతరాయంగా రచనలు చేశారు. ఉపనిషత్తులు, మనుస్మృతి, వేదాంత దర్శనం, నిరుక్తం తదితర వైదిక గ్రంథాలను ఆంధ్రీకరించారు. సంస్కృత పాఠమాల అనే సంస్కృత భాషా బోధినిని గురించి రచించారు. దా నరసింహం గారి జీవితము, రచనల గురించి ఒక పి హెచ్ డి పరిశోధన గ్రంథం కూడా వెలువడింది. ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు వీటి శైలి సహజముగా ఉన్నది అనియు పుస్తకములు శిథిల దశలో నుండుటచే తత్ క్షణ ముద్రణావశ్యక మున్నదని అభిప్రాయము వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము. మన ప్రాచీన సంస్కృతియందు ఆసక్తి ఉన్న తెలుగువారిలో ఏ కొద్ది మందికైనా ఇవి ఉపయోగపడగలవని ఆశించుచున్నాము.
డా ఈశ్వర వరాహ నరసింహం గారు వ్రుత్తి రీత్యా వైద్యులు. సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ, ఒరియా, ఉర్దూ భాషలలో నిష్టాత్తులు. పర్షియన్ భాషా పరిచయం కూడా ఉంది. వేదంవేదాంగాలలోను, జ్యోతిష శాస్త్రంలోను పాండిత్యం కలిగినవారు. తన 26 వ ఏట ప్రారంభించి 69 ఏట వరకు నిరంతరాయంగా రచనలు చేశారు. ఉపనిషత్తులు, మనుస్మృతి, వేదాంత దర్శనం, నిరుక్తం తదితర వైదిక గ్రంథాలను ఆంధ్రీకరించారు. సంస్కృత పాఠమాల అనే సంస్కృత భాషా బోధినిని గురించి రచించారు. దా నరసింహం గారి జీవితము, రచనల గురించి ఒక పి హెచ్ డి పరిశోధన గ్రంథం కూడా వెలువడింది. ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు వీటి శైలి సహజముగా ఉన్నది అనియు పుస్తకములు శిథిల దశలో నుండుటచే తత్ క్షణ ముద్రణావశ్యక మున్నదని అభిప్రాయము వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము. మన ప్రాచీన సంస్కృతియందు ఆసక్తి ఉన్న తెలుగువారిలో ఏ కొద్ది మందికైనా ఇవి ఉపయోగపడగలవని ఆశించుచున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.