'ఇంటిని చూసి ఇల్లాలుని చూడు' యను నానుడి ప్రకారముగా, నిరంతరము గృహశుద్ధిలోను, పూజ పునస్కారములలోను నిమగ్నమైవుండు నా శ్రీమతి సరోజినీ, పుస్తకాల పురుగులాగా నిరంతరము గ్రంధపఠనములో నిమగ్నమైవుండు నన్ను చూచి విసుగుకొనకుండా, మిక్కిలి సహనముతో నా యీ గ్రంథరచనకు ఎంతో ప్రోత్సహించుతూ, నాకు సహకారము అందించినందులకు ఆమెకు నా హృదయపూర్వక ఆశిర్వాదములు అందించుచుంటిని.
ఈ గ్రంధ రచనలో ఆయా కావ్యములను మరియు అనేక యితర గ్రంధములను పఠించి అందు గల విషయములను ఆధారంగా తీసుకొంటిని. స్వతంత్రించి ఏ విషయమును స్వయముగా కల్పించి వ్రాయలేదు. అయినప్పటికీ యీ గ్రంధరచనములో విషయలోపములు గాని, భాషాపరంగా వున్నా దోషములు గాని వున్న ఎడల మన్నించగలరని పాఠకులను కోరుచున్నాను. ఈ గ్రంధము ఆబాలగోపాలము అందరూ పఠించి పురుణ పురుషుల దివ్య చరిత్రలను తెలుసుకొని, చెడును త్యజించి మంచిని పెంచుకుంటూ, మన సంస్కృతిని సంస్కారమును పెంపొందించుకుంటూ, ఆనాటి పుణ్యపురుషుల వలె ఆదర్శ మూర్తులుగా తమ జీవితములను మలచుకొని, భగవంతుని విశ్వసించి భక్తిశ్రద్ధలతో తమ జీవితములను పావనము చేసుకొనగలరని ఆశించుచున్నాను.
- సామినేని ప్రకాశరావు
'ఇంటిని చూసి ఇల్లాలుని చూడు' యను నానుడి ప్రకారముగా, నిరంతరము గృహశుద్ధిలోను, పూజ పునస్కారములలోను నిమగ్నమైవుండు నా శ్రీమతి సరోజినీ, పుస్తకాల పురుగులాగా నిరంతరము గ్రంధపఠనములో నిమగ్నమైవుండు నన్ను చూచి విసుగుకొనకుండా, మిక్కిలి సహనముతో నా యీ గ్రంథరచనకు ఎంతో ప్రోత్సహించుతూ, నాకు సహకారము అందించినందులకు ఆమెకు నా హృదయపూర్వక ఆశిర్వాదములు అందించుచుంటిని. ఈ గ్రంధ రచనలో ఆయా కావ్యములను మరియు అనేక యితర గ్రంధములను పఠించి అందు గల విషయములను ఆధారంగా తీసుకొంటిని. స్వతంత్రించి ఏ విషయమును స్వయముగా కల్పించి వ్రాయలేదు. అయినప్పటికీ యీ గ్రంధరచనములో విషయలోపములు గాని, భాషాపరంగా వున్నా దోషములు గాని వున్న ఎడల మన్నించగలరని పాఠకులను కోరుచున్నాను. ఈ గ్రంధము ఆబాలగోపాలము అందరూ పఠించి పురుణ పురుషుల దివ్య చరిత్రలను తెలుసుకొని, చెడును త్యజించి మంచిని పెంచుకుంటూ, మన సంస్కృతిని సంస్కారమును పెంపొందించుకుంటూ, ఆనాటి పుణ్యపురుషుల వలె ఆదర్శ మూర్తులుగా తమ జీవితములను మలచుకొని, భగవంతుని విశ్వసించి భక్తిశ్రద్ధలతో తమ జీవితములను పావనము చేసుకొనగలరని ఆశించుచున్నాను. - సామినేని ప్రకాశరావు
© 2017,www.logili.com All Rights Reserved.