ఇంగ్లీషులో ఉన్న గ్రీకు, రోమన్, బాబిలోనియా గాథల పుస్తకాలన్ని చదివి పిల్లలకు కలిగిన సందేహాలు తీర్చడమే కాక ఆ గాథలు తెలుగులో సరళ సుందరంగా రాసి సుజాత మొదలైన పత్రికల్లో ప్రకటించినారట. వీరభద్రరావుగారు గాథలు చాలా వ్రాసినారు. సమగ్రంగా అచ్చువేస్తే పెద్ద గ్రంథం అవుతుంది. వీటిలో 68 గాథలను ఏరి రాజమహేంద్రవరం విశ్వసాహిత్యమాలవారు 1958 లో గ్రీకు పురాణ గాథలు అనే పేరుతో ఒక పుస్తకం ప్రకటించినారు.
ఈ గాథలు చదువుతుంటే మన పురాణేతిహాసాలలోని దేవతలు, దేవజాతికి చెందిన గరుడ యక్ష గంధర్వ కిన్నరాదులు, రాక్షసులు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు మొదలైన వాటితో కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఈ గ్రీకు రోమను పురాణాలు వాటిలోని పేర్లు పోలికలు సరిచూసుకుంటూ అనువదించటానికి ఆదిరాజు వారెంత శ్రమపడ్డారో స్థాలీపులాకంగనైన ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ఆముద్రితంగా మిగిలిపోయిన గాథలు కూడా ముద్రిస్తే తెలుగు భాషలో ఇదొక అపూర్వ గ్రంథం అవుతుంది.
- ఏటకూరి ప్రసాద్
ఇంగ్లీషులో ఉన్న గ్రీకు, రోమన్, బాబిలోనియా గాథల పుస్తకాలన్ని చదివి పిల్లలకు కలిగిన సందేహాలు తీర్చడమే కాక ఆ గాథలు తెలుగులో సరళ సుందరంగా రాసి సుజాత మొదలైన పత్రికల్లో ప్రకటించినారట. వీరభద్రరావుగారు గాథలు చాలా వ్రాసినారు. సమగ్రంగా అచ్చువేస్తే పెద్ద గ్రంథం అవుతుంది. వీటిలో 68 గాథలను ఏరి రాజమహేంద్రవరం విశ్వసాహిత్యమాలవారు 1958 లో గ్రీకు పురాణ గాథలు అనే పేరుతో ఒక పుస్తకం ప్రకటించినారు. ఈ గాథలు చదువుతుంటే మన పురాణేతిహాసాలలోని దేవతలు, దేవజాతికి చెందిన గరుడ యక్ష గంధర్వ కిన్నరాదులు, రాక్షసులు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు మొదలైన వాటితో కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఈ గ్రీకు రోమను పురాణాలు వాటిలోని పేర్లు పోలికలు సరిచూసుకుంటూ అనువదించటానికి ఆదిరాజు వారెంత శ్రమపడ్డారో స్థాలీపులాకంగనైన ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ఆముద్రితంగా మిగిలిపోయిన గాథలు కూడా ముద్రిస్తే తెలుగు భాషలో ఇదొక అపూర్వ గ్రంథం అవుతుంది. - ఏటకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.