ఈ పుస్తకం గురించి ప్రముఖ సాహితీవేత్తలు ఏమన్నారంటే...
గురజాడ రచనా వస్తువునే కాదు శైలినీ ఆధునికం చేశాడు. రచన రుక చేయాల్సిన అంశాన్ని సామాజిక ఉన్నతికి, పురోగమనానికి లక్ష్యించాలని, అప్పటిదాకా సమాజాన్ని పట్టుకు పీడించే అన్ని దౌష్ట్యాలనూ ఖండించాలని, దురాచారాల రూపుమాపి సమాజాన్ని ‘దిద్దుబాటు' చేయాల్సిన కర్తవ్యం రచయితదని నిర్దేశించాడు. ఆధునిక సాహిత్య జాడ గురజాడది.
అయితే వస్తు, శిల్పాల్లో గురజాడ వేసిన జాడను నిత్యనూతనంగా సమాజం చర్చిస్తోనే వుంది. వాస్తు, శిల్పాలతో పాటు భాష గురించిన చర్చ కూడా నడుస్తోంది. 'నాది ప్రజా ఉద్యమం, యెవరినో సంతృప్తి పరచడానికి ప్రజల భాషను ఒదులుకోను' అన్న గురజాడ ప్రజల భాషకు సాహిత్య గౌరవాన్ని కలిగించాడు. తన ప్రాంత మాండలికాన్ని అద్భుతంగా రచనల్లో ప్రయోగించాడు. ఇప్పటికీ గురజాడ ప్రయోగించిన మాండలిక పదజాలాలకు నిజమైన అర్థాలను తెలుసుకోలేక పోతున్నాము. కొంతమంది ఇప్పటికే ప్రకాశరావు గారిలా గురజాడ ప్రయోగించిన పదజాలాలకు నిఘంటువులు వంటి వ్యాస సంకలనాలు ప్రచురించారు.
గురజాడ కేవలం తన ప్రాంత మాండలిక పదజాలమే కాక విదేశీ పదజాలాలు, అన్యభాషా పదజాలాలు ఆయా సందర్భాల్లో తన రచనకు బలాన్ని కలగడానికి ఉపయో గించారు. ఆ పదజాలాల నిజ అర్థాలను తెలుసుకుంటే గానీ గురజాడ యే భావాన్ని............
ఈ పుస్తకం గురించి ప్రముఖ సాహితీవేత్తలు ఏమన్నారంటే... గురజాడ రచనల నిఘంటువులకు మేలిమైనది ఈ వ్యాస సంపుటి గురజాడ రచనా వస్తువునే కాదు శైలినీ ఆధునికం చేశాడు. రచన రుక చేయాల్సిన అంశాన్ని సామాజిక ఉన్నతికి, పురోగమనానికి లక్ష్యించాలని, అప్పటిదాకా సమాజాన్ని పట్టుకు పీడించే అన్ని దౌష్ట్యాలనూ ఖండించాలని, దురాచారాల రూపుమాపి సమాజాన్ని ‘దిద్దుబాటు' చేయాల్సిన కర్తవ్యం రచయితదని నిర్దేశించాడు. ఆధునిక సాహిత్య జాడ గురజాడది. అయితే వస్తు, శిల్పాల్లో గురజాడ వేసిన జాడను నిత్యనూతనంగా సమాజం చర్చిస్తోనే వుంది. వాస్తు, శిల్పాలతో పాటు భాష గురించిన చర్చ కూడా నడుస్తోంది. 'నాది ప్రజా ఉద్యమం, యెవరినో సంతృప్తి పరచడానికి ప్రజల భాషను ఒదులుకోను' అన్న గురజాడ ప్రజల భాషకు సాహిత్య గౌరవాన్ని కలిగించాడు. తన ప్రాంత మాండలికాన్ని అద్భుతంగా రచనల్లో ప్రయోగించాడు. ఇప్పటికీ గురజాడ ప్రయోగించిన మాండలిక పదజాలాలకు నిజమైన అర్థాలను తెలుసుకోలేక పోతున్నాము. కొంతమంది ఇప్పటికే ప్రకాశరావు గారిలా గురజాడ ప్రయోగించిన పదజాలాలకు నిఘంటువులు వంటి వ్యాస సంకలనాలు ప్రచురించారు. గురజాడ కేవలం తన ప్రాంత మాండలిక పదజాలమే కాక విదేశీ పదజాలాలు, అన్యభాషా పదజాలాలు ఆయా సందర్భాల్లో తన రచనకు బలాన్ని కలగడానికి ఉపయో గించారు. ఆ పదజాలాల నిజ అర్థాలను తెలుసుకుంటే గానీ గురజాడ యే భావాన్ని............© 2017,www.logili.com All Rights Reserved.