ప్రతి భక్తుడు తన ఆవేదనను భగవంతునికి నివేదించుకోవడంలో ఒక పాటనో, ఒక మంత్రాన్నో, జపాన్నో, స్తోత్రాన్నో.... ఏదీ కాకపోతే సామాన్య భాషగా దేవుడా! నన్ను రక్షించు అంటూ ఒక మాట రూపంలోనో బాధను నివేదించుకుంటాడు. ఏ రూపంగా విన్నవించుకున్నా ప్రతిదానికి "మనస్పూర్తి నివేదన" అత్యవసరం. దీనిని పురస్కరించుకొనే ఇటువంటి స్తోత్రాలు ఉద్భవిస్తూ ఉంటాయి.
అయితే ప్రస్తుతం తెలియపరచబడిన యీ స్తోత్రాలు అత్యంత భక్తిదాయకమైన పురాణాలలోనివి చేసినవారూ పరమ పుణ్యాత్ములు, గజేంద్రుని నుంచి బ్రహ్మ వరకు అంటే గజేంద్రుడు, నారదుడు భీష్ముడు, ధర్మరాజు, అర్జునుడు, కుంతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు స్తోత్రాలను ఆలపించి వారి క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. అంటే ఆయా స్తోత్రాల కున్న ప్రభావం అటువంటిదన్నమాట.
- నాగినేని లీలాప్రసాద్