కలకాలం నిలిచే కధలు ఇవి.
నిజాయితీ, నిబద్ధత ఇరుసులుగా, వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో పరిమళించిన కధలు.
మనుషులకు రకరకాల కలలు, కధలు ఉన్నట్లే, దేశ ప్రాంతాలకు, ప్రదేశాలకు ప్రత్యేకమైన నిర్దేశాలు, నిరాకరించ వీలులేని నిరతిశయాలు ఉంటాయి. ఆ ప్రాంతం భాష, ఆ వాతావరణాల కలయికలో రాసినప్పుడే అవి బాగా రాణిస్తాయి. ఈ కధలు సాఫీగా చదువుకుపోవడానికి ప్రాంతీయ పడికట్టులు అంతగా అడ్డు తగలవు. ఇందులోని 13 కధలలోనూ కడప జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మనుషులు, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనసత్త్యాలు కనిపిస్తాయి. కధలన్నీ వాస్తవికతను, మానసిక దౌర్భల్యాల నుంచి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి నిజంగా జరగవలసిన మార్పుచేర్పులను సూచిస్తాయి. సకారణంగా, సోదాహరణలతో చెబుతాయి.
సహృదయులందరూ ఆదరించి ఆచరణ సూత్రాలు తయారు చేసుకోవలసిన కధల సంపుటం ఇది. రచయిత నిజాయితీ, నిబద్ధత అభినందనీయం.
- వేంపల్లి గంగాధర్
కలకాలం నిలిచే కధలు ఇవి. నిజాయితీ, నిబద్ధత ఇరుసులుగా, వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో పరిమళించిన కధలు. మనుషులకు రకరకాల కలలు, కధలు ఉన్నట్లే, దేశ ప్రాంతాలకు, ప్రదేశాలకు ప్రత్యేకమైన నిర్దేశాలు, నిరాకరించ వీలులేని నిరతిశయాలు ఉంటాయి. ఆ ప్రాంతం భాష, ఆ వాతావరణాల కలయికలో రాసినప్పుడే అవి బాగా రాణిస్తాయి. ఈ కధలు సాఫీగా చదువుకుపోవడానికి ప్రాంతీయ పడికట్టులు అంతగా అడ్డు తగలవు. ఇందులోని 13 కధలలోనూ కడప జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మనుషులు, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనసత్త్యాలు కనిపిస్తాయి. కధలన్నీ వాస్తవికతను, మానసిక దౌర్భల్యాల నుంచి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి నిజంగా జరగవలసిన మార్పుచేర్పులను సూచిస్తాయి. సకారణంగా, సోదాహరణలతో చెబుతాయి. సహృదయులందరూ ఆదరించి ఆచరణ సూత్రాలు తయారు చేసుకోవలసిన కధల సంపుటం ఇది. రచయిత నిజాయితీ, నిబద్ధత అభినందనీయం. - వేంపల్లి గంగాధర్© 2017,www.logili.com All Rights Reserved.