'ప్రతి' గ్రామంలో 'విష్ణుబావు భూసరి' గా జన్మించి
'షిరిడీ' గ్రామంలో 'సాయిబాబా' గా అవతరించిన మహాత్ముడు.
'వెంకూసా' ను తన తొలి గురువుగా ఆరాధించిన పరమయోగి.
తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామికి ధీటుగా
లక్షలాదిమంది ఆర్తుల్ని భక్తుల్ని షిరిడీకి ఆకర్షిస్తున్న తపస్వి.
'ఓ సాయి' అని పిలిస్తే 'ఓయ్' అని పలికే ప్రత్యేక్ష దైవం.
హైందవ గురువును, సూఫీ గురువును సేవించి
హిందూ - ముస్లిం భావైక్యతను వారధి నిర్మించిన మహర్షి.
ఎనభై సంవత్సరాల జీవితకాలంలో డెబ్బయ్ సంవత్సరాలు
అజ్ఞాతంగా గడిపినా తపస్సుతో పండి భక్తజన హృదయాలను
'సాయి మందిరాలు' గా మార్చిన సిద్ధ పురుషుడు.
జీవితానుభవాలలో విశ్వవేదాంత సారాన్ని, జీవిత తత్వాలను,
పరమార్థ రహస్యాలను సుబోధకం చేసిన పునీత చరిత్రుడు.
సాయిబాబా మతాలకు అతీతుడు.
మానవతకు పారమార్థిక బంధువు.
యోగసాధకులకు సమర్థ సద్గురువు.
నిత్యపారాయణదివ్య సాయి చరిత్ర ఇది.
'ప్రతి' గ్రామంలో 'విష్ణుబావు భూసరి' గా జన్మించి 'షిరిడీ' గ్రామంలో 'సాయిబాబా' గా అవతరించిన మహాత్ముడు. 'వెంకూసా' ను తన తొలి గురువుగా ఆరాధించిన పరమయోగి. తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామికి ధీటుగా లక్షలాదిమంది ఆర్తుల్ని భక్తుల్ని షిరిడీకి ఆకర్షిస్తున్న తపస్వి. 'ఓ సాయి' అని పిలిస్తే 'ఓయ్' అని పలికే ప్రత్యేక్ష దైవం. హైందవ గురువును, సూఫీ గురువును సేవించి హిందూ - ముస్లిం భావైక్యతను వారధి నిర్మించిన మహర్షి. ఎనభై సంవత్సరాల జీవితకాలంలో డెబ్బయ్ సంవత్సరాలు అజ్ఞాతంగా గడిపినా తపస్సుతో పండి భక్తజన హృదయాలను 'సాయి మందిరాలు' గా మార్చిన సిద్ధ పురుషుడు. జీవితానుభవాలలో విశ్వవేదాంత సారాన్ని, జీవిత తత్వాలను, పరమార్థ రహస్యాలను సుబోధకం చేసిన పునీత చరిత్రుడు. సాయిబాబా మతాలకు అతీతుడు. మానవతకు పారమార్థిక బంధువు. యోగసాధకులకు సమర్థ సద్గురువు. నిత్యపారాయణదివ్య సాయి చరిత్ర ఇది.© 2017,www.logili.com All Rights Reserved.