బాధలో ఉన్నప్పుడు అబ్బా అనీ, విసుగులో ఉన్నప్పుడు అబ్బబ్బా అనీ.. ఆశ్చర్యం, ప్రశంసలలో ఉన్నప్పుడు అబ్బో అనీ అనుకుంటాం అంటాం. ప్రేమ వ్యక్తం చేస్తూ వీడు మా "అబ్బాయి" అనీ, కోపంలో - తిరస్కారంలో 'నీ అబ్బముల్లె ఏమైనా ఇక్కడ ఉందా' అని కూడా అంటూ ఉంటాము. అలానే 'అమ్మో' 'అమ్మమ్మా ఎంతమాట?', 'అమ్మయ్య' అని రకరకాల అవస్థలలో అంటూ ఉంటాము. మనం తలచుకున్న ఈ అబ్బ - అమ్మ ఎవరు? ఇన్ని రకాల విచిత్ర భావనలలో స్పందించవలసిన బాధ్యత వారికి ఉంటుందా? ఇలాంటివే అయ్యో, అయ్యయ్యో అన్నా - అన్నన్నా వగైరాల వివిధ దశలలో అనుకుంటాం. ఇలా మనం తలచుకున్నవాళ్ళు మనకంటే పెద్దవారు, గొప్పవారు అయి ఉంటారు. మన కష్టసుఖాలలో తెలిసో, తెలియకో మనం అనుకునే ఈ మాటలు 'దైవాన్ని' సూచిస్తాయి. ఆ దైవాన్ని కదిలిస్తాయి. దానిని మనం గుర్తించవచ్చు. లేకపోవచ్చు.
బాధలో ఉన్నప్పుడు అబ్బా అనీ, విసుగులో ఉన్నప్పుడు అబ్బబ్బా అనీ.. ఆశ్చర్యం, ప్రశంసలలో ఉన్నప్పుడు అబ్బో అనీ అనుకుంటాం అంటాం. ప్రేమ వ్యక్తం చేస్తూ వీడు మా "అబ్బాయి" అనీ, కోపంలో - తిరస్కారంలో 'నీ అబ్బముల్లె ఏమైనా ఇక్కడ ఉందా' అని కూడా అంటూ ఉంటాము. అలానే 'అమ్మో' 'అమ్మమ్మా ఎంతమాట?', 'అమ్మయ్య' అని రకరకాల అవస్థలలో అంటూ ఉంటాము. మనం తలచుకున్న ఈ అబ్బ - అమ్మ ఎవరు? ఇన్ని రకాల విచిత్ర భావనలలో స్పందించవలసిన బాధ్యత వారికి ఉంటుందా? ఇలాంటివే అయ్యో, అయ్యయ్యో అన్నా - అన్నన్నా వగైరాల వివిధ దశలలో అనుకుంటాం. ఇలా మనం తలచుకున్నవాళ్ళు మనకంటే పెద్దవారు, గొప్పవారు అయి ఉంటారు. మన కష్టసుఖాలలో తెలిసో, తెలియకో మనం అనుకునే ఈ మాటలు 'దైవాన్ని' సూచిస్తాయి. ఆ దైవాన్ని కదిలిస్తాయి. దానిని మనం గుర్తించవచ్చు. లేకపోవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.